ద్రోహులకి టిక్కెట్లా: సురేఖపై కెసిఆర్‌కి కోదండ, ఇరకాటం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆదివారం పరోక్ష విమర్శలు గుప్పించారు. తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని కోదండ పరోక్షంగా ప్రశ్నించారు.

మాజీ మంత్రి కొండా సురేఖ, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిలు ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. ఉద్యమ ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి వారికి నాయకత్వం అప్పగిస్తే, టిక్కెట్లు ఇస్తే ప్రజల విశ్వాసం సన్నిగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Konda Surekha joins TRS: Kodanda targets KCR

తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొండా సురేఖ, మహేందర్ రెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డిలు ఉద్యమ ద్రోహులే అన్నారు. వారికి టిక్కెట్లు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై తాము త్వరలో ఓ నిర్ణయానికి వస్తామని కోదండ చెప్పారు.

ఇరుకునపడ్డ తెరాస

ఉద్యమ ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారన్న కోదండరామ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర సమితి ఇరుకున పడింది. ఉద్యమాన్ని అడ్డుకున్న వారికి టిక్కెట్లు ఇలా ఇస్తారని జెఏసి పరోక్షంగా ప్రస్తావించడం, పెద్దపల్లి ఎంపి వివేక్ ఢిల్లీలో కాంగ్రెసు పెద్దలతో కలిసిన నేపథ్యంలో కెసిఆర్ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+