జగన్ సభపై కొండా సురేఖ వార్న్, 16కంపెనీల బలగాలు

Konda Surekha on YS Jagan meeting
వరంగల్/హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభ పెట్టడం సరికాదని మాజీ మంత్రి కొండా సురేఖ బుధవారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తుండగా జగన్ హైదరాబాదులో సమైక్య సభ పెట్టడమేమిటని ప్రశ్నించారు. సభ ఉద్రిక్తలకు దారి తీస్తుందని హెచ్చరించారు.

జగన్ సభకు భారీ బందోబస్తు

ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరయ్యే కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఎంపిక చేశారు.

బుధవారం నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడలించారు. ఎపిఎస్పీకి చెందిన 34 ప్లటూన్లతోపాటు కేంద్ర పారా మిలటరీకి చెందిన పదహారు కంపెనీలను రంగంలోకి దింపుతున్నారు. 1800 మంది సివిల్ పోలీసులను బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు.

ఎన్టీఆర్ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్‌లో వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. స్టేడియంలో ప్రవేశానికి సంబంధించి అన్ని ఇన్నర్ గేట్లను తెరుస్తామని చెప్పారు. ఎపిఎన్జీవో సభ సందర్భంగా నిజాం కళాశాల వద్ద జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+