టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా ? నాగబాబు అంచనా ఇదే..!
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్న చర్చ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి కారణం గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఈ మూడు పార్టీలు భారీగా నష్టపోవడమే. గతంలో 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినా కాషాయ పార్టీకి సరైన ఓటు బ్యాంకు లేకపోవడంతో భారీ ఎత్తున గెలుపు సాధ్యపడలేదు. కానీ ఈసారి బీజేపీతో పోలిస్తే క్షేత్రస్ధాయిలో బలమున్న జనసేన కలవడంతో ఓటు బ్యాంకు బదిలీపై చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీపై జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు తన విశ్లేషణ తెలిపారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ఓటు బదిలీ వంద శాతం జరిగి తీరుతుందని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటూ గతంలో ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రతిఫలాలు మనం ఇప్పుడు చూడబోతున్నామని నాగబాబు తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు కుదర్చడానికి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ చేసిన కృషిని నాగబాబు ప్రశంసించారు. పవన్ ఏ అంశం ప్రస్తావించినా, ఏ నిర్ణయం తీసుకున్నా అనతి కాలంలోనే అనూహ్య ఫలితాలు వస్తాయని నాగబాబు తెలిపారు. ఇప్పుడు విపక్షాల కూటమి విషయంలోనూ భారీ స్పందన వస్తోందన్నారు. జనసేన కార్యాలయంలో గత వారం రోజుల్లో వెయ్యి మంది కార్యకర్తలతో మాట్లాడానని, అంతా పవన్ నిర్ణయం శిరసావహిస్తామని, కూటమి అభ్యర్ధుల్ని గెలిపించుకుంటామంటున్నారని నాగబాబు తెలిపారు.
అలాగే పొత్తు కారణంగా పోటీ చేసే అవకాశం రాని పలువురు ఆశావహులను కూడా కేంద్ర కార్యాలయానికి పిలిచి ఒక్కొక్కరితో సుదీర్ఘంగా మాట్లాడుతున్నట్లు నాగబాబు తెలిపారు. ఈ దఫా మాకు అవకాశం రాక పోయినా ఫర్వాలేదు. వచ్చే ఎన్నికల వరకూ ఆగుతాం. కానీ ఇప్పుడు మాత్రం కూటమి అభ్యర్థులు గెలవాలి., దాని కోసం మా శాయశక్తులా కృషి చేస్తామని వారు చెప్తున్నారని నాగబాబు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న ప్రతీ ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ఉమ్మడి ప్రభుత్వంలో గౌరవం లభిస్తుందని పవన్ తనతో స్వయంగా చెప్పారన్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications