అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాపును చూసి బలుపనుకుంటే మునిగిపోయేది వైసీపీనే : కూన రవి కుమార్ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మెజారిటీ స్థానాలు వైసీపీకి వచ్చాయని చంకలు గుద్దుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 85 శాతం పంచాయతీలు వైసీపీకి వచ్చాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పుకుంటున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సొంత చెల్లెళ్ళకే జగన్ వెన్నుపోటు, చెల్లెలు షర్మిల పార్టీపై మాట్లాడరేం .. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్సొంత చెల్లెళ్ళకే జగన్ వెన్నుపోటు, చెల్లెలు షర్మిల పార్టీపై మాట్లాడరేం .. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

వైసీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు

వైసీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు

వాపును చూసి బలుపు అనుకుంటే మునిగిపోయేది వైసిపినే అంటూ కూన రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసిపి నేతలు కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని పేర్కొన్న కూన రవికుమార్, వైసీపీ చెప్పుకుంటున్నన్ని స్థానాలు వైసీపీ ఖాతాలో లేవని, రెబెల్స్ గా గెలిచిన వారిని కూడా తమ ఖాతాలో వేసుకుని, అదే విజయమని భ్రమపడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రెండు శాతం పంచాయతీలకు అసలు ఎన్నికలే జరగని లేదని, కానీ 98 శాతం గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పటం హాస్యాస్పదం అంటూ, బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్.

 బొత్సాది అజ్ఞానమో, అహంకారమో అర్ధం కావటం లేదు

బొత్సాది అజ్ఞానమో, అహంకారమో అర్ధం కావటం లేదు


పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అహంకారంతో మాట్లాడుతున్నారో , అజ్ఞానంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇక విజయసాయి రెడ్డి మాటలు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గెలుపోటములు సహజం అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు కూన రవికుమార్.

రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడితే ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కూన రవికుమార్ .

పెద్దకోట బ్యాలెట్ పేపర్స్ వ్యవహారంపై తక్షణ విచారణకు డిమాండ్

పెద్దకోట బ్యాలెట్ పేపర్స్ వ్యవహారంపై తక్షణ విచారణకు డిమాండ్

ఎల్ ఎన్ పేట మండలం పెద్దకోట బ్యాలెట్ పేపర్స్ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు. అధికారులు సహకారంతోనే తప్పులు జరిగాయని, జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.
మూడు విడతల్లో మాదే విజయం అని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ టీడీపీ విజయం సాధించి తీరుతుంది అని కూన రవి కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

English summary
Koona Ravikumar said that some of the YCP leaders were speaking with arrogance, adding that the YCP claiming that even those who won as Rebels were being taken into account and were under the illusion of the same victory. Former MLA Kuna Ravikumar has targeted Botsa Satyanarayana, saying it was ridiculous for Minister Botsa Satyanarayana to say that the actual elections would not be held for the two per cent panchayats in the state but would win 98 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X