కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కోటంరెడ్డి లేఖ..!!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందని ఆరోపించిర కోటంరెడ్డి ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేసారు. కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం.. వైసీపీ నేతల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇప్పుడు ఎంపీ..రూరల్ కొత్త ఇంఛార్జ్ ఆదాల పైన మండిపడ్డారు. ఆదాల నామినేషన్ల ముందు రోజు వైసీపీలో చేరారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పును శిరసా వహిస్తానని చెప్పారు. పార్టీ శ్రేణులు తనతోనే ఉంటారనే ఆశాభావం వ్యక్తం చేసారు. ఇటు కోటంరెడ్డి లక్ష్యంగా వైసీపీ నెల్లూరు రూరల్ లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో కోటంరెడ్డి కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు.

కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేసారంటూ ప్రభుత్వ పెద్దల పైన ఆరోపణలు చేసారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తనకు తన ఫోన్ రికార్డు పంపారని.. ఆ రికార్డు తాను తన స్నేహితుడితో మాట్లాడిందిగా వెల్లడించారు. తనది..తన స్నేహితుడిది ఇద్దరిదీ ఐ ఫోన్ అని చెప్పిన కోటంరెడ్డి.. ఆ రెండు ఫోన్లలో రికార్డింగ్ అవకాశం లేదని చెప్పుకొచ్చారు. తనతో పాటుగా పలువురి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. దీని పైన మంత్రులు..మాజీ మంత్రులు స్పందించారు. ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఇప్పుడు ఇదే వ్యవహారం పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖ రాసారు. తన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని లేఖలో అభ్యర్ధించారు. అవకాశం వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానన్నారు.

Kotamreddy Sridhar Reddy letter to Home Minister Amith Shah, seek Enquiry on Phone tapping

తాను ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపైన చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు.ట్యాపింగ్‌పై ఆరోపణలు చేస్తే తన పైనే విమర్శలకు దిగుతున్నారన్నారు. తాను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలన్నారు. తాను ఇప్పటికే ప్రస్తావించిన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Kotamreddy Sridhar Reddy letter to Home Minister Amith Shah, seek Enquiry on Phone tapping

అనుచరులో సమావేశమైన కోటంరెడ్డి తను విధిలేని పరిస్థితుల్లోనే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని...2024లో ఎటువంటి తీర్పు ఇచ్చినా శిరసా వహిస్తానని చెప్పారు. ఒక సైనికుడిలా పని చేస్తానని వెల్లడించారు. ఆదాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆదాల లాగా తనకు డ్రామాలు ఆడటం రాదన్నారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా..ప్రజల మనస్సుల్లో అభిమానం ఉండాలని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+