వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధింపులపై సభలో కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే ఈశ్వరి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kothapalli Geetha speech on harassment in Lok Sabha
న్యూఢిల్లీ/విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత గురువారం లోకసభలో లైంగిక వేధింపుల అంశంపై మాట్లాడారు. దేశంలోని మహిళలపై వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ మహిళా జడ్జి పైనే లైంగిక దాడులు జరుగుతుంటే సాధారణ పౌరులకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు.

లైంగిక వేధింపులకు పాల్పడేవారు, అత్యాచారాలు చేసేవారు బెయిల్ పైన విడుదలై బాధితుల కళ్ల ముందే తిరుగుతుంటే వారికి న్యాయం జరిగినట్టు ఎలా భావిస్తారన్నారు. చట్టాలు కఠినంగా అమలైతే న్యాయం జరుగుతుందని, ఒత్తిళ్లు లేని పరిపాలన కావాలన్నారు. మహిళలపై జరిగే దారుణాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. మహిళలపై వివక్షకు అడ్డుకట్ట పడకపోతే భారతదేశం అభివృద్ధి సాధించలేదన్నారు.

సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య రాతలు రాస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హోదాలతో సంబంధం లేకుండా మహిళలను నీచంగా చూస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియా అత్యంత పవర్ ఫుల్ మీడియా అని, చట్టాల కంటే కూడా వ్యక్తుల్లో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.

ఈశ్వరి నిప్పులు

కొత్తపల్లి గీత పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి విశాఖలో నిప్పులు చెరిగారు. గీతకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. ఫేస్‌బుక్ కామెంట్ల పేరుతో గీత ప్రచారం కోసం తాపత్రయపడుతున్నారన్నారు. తమ పార్టీ వారి పైన కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. గీత ఎస్టీ కాదని నిరూపించే ఆధారాలు త్వరలో బయటపెడతానని చెప్పారు.

English summary
YSR Congress Party MP Kothapalli Geetha speech on harassment in Lok Sabha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X