టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!
పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పోటీ చేసిన కొత్తపల్లి ఇప్పుడు జనసేన బాట పట్టారు. నర్సాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేస్తుండటం తో కొత్తపల్లి నర్సాపురం ఎమ్మెల్యేగా నర్సాపురం నుండి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. దీంతో..ఇప్పటికే జనసేన నుం డి నర్సాపురం అభ్యర్దిగా ప్రకటించిన వ్యక్తిని బి ఫారం ఆపినట్లు తెలుస్తోంది.
జనసేన లోకి కొత్తపల్లి..
టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు ఆయన ప్రస్తుతం కాపు కార్పోరేషన్ చైర్మన్ గా ఉండగా..ఆ పదవికి రాజీనామా చేసారు. నర్సాపురం నుండి కొత్తపల్లి టిడిపి టిక్కెట్ ఆశించారు. అయితే, టిడిపి అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవ నాయుడు కు కేటాయించింది. దీంతో, కొత్తపల్లి మనస్థాపానికి గురయ్యారు. ఆయన తన అనుచరులతో సమావేశం అయ్యారు. జనసేన లోకి రావాలని ఆ పార్టీ నుండి ఆహ్వానం అందింది. కొత్తపల్లి గతంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి 41 వేల ఓట్లను సాధించారు. ఆ తరువాత ఆయన వైసిపి లో చేరా రు. ప్రస్తుతం టిడిపిలో ఉన్న కొత్తపల్లి తన అనుచరులతో సమావేశం తరువాత పార్టీ వీడటం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నుండి నర్సాపురం ఎంపీగా నాగబాబు పోటీలో ఉండటంతో..ఇదే అసెంబ్లీ స్థానం నుండి జనసేన అభ్య ర్దిగా పోటీ చేసేందుకు కొత్తపల్లి ఆసక్తి తో ఉన్నారు.

అయిదు సార్లు ఎమ్మెల్యేగా..
కొత్తపల్లి సుబ్బారాయుడు తొలుత టిడిపి నుండి నాలుగు సార్లు..ఒక సారి కాంగ్రెస్ నుండి నర్సాపురం ఎమ్మెల్యేగా గెలిచా రు. అదే విధంగా రెండు సార్లు ఓటమి చవి చూసారు. ప్రజారాజ్యం లో ఉన్న సమయంలో మెగా బ్రదర్స్ తో ఉన్న సాన్నిహిత్యం తో తిరిగి ఇప్పుడు జనసేన నుండి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. కొత్తపల్లి తో జనసేన నేత లు సైతం టచ్ లో ఉన్నారు. ఇప్పటికే నర్సాపురం జనసేన అభ్యర్దిగా నాయకర్ ను ఆ పార్టీ ప్రకటించింది. అయితే, కొత్తపల్లి పార్టీ లో చేరిక సమాచారంతో ఆయనకు బి ఫారం నిలిపివేసిట్లు తెలుస్తోంది. కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరితే ఆయన కే ఆ సీటు కేటాయించనున్నారు. చివరి నిమిషంలో ఆయన పార్టీలోకి రాకపోతే ఇప్పటికే ప్రకటించి న అభ్యర్దినే ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications