జగన్‌కు ఊరట: వైయస్సార్ కాంగ్రెసులోకి కొత్తపల్లి

Kothapalli Subbarayudu
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కాంగ్రెసు శాసనసభ్యుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఆయన ఆదివారం నరసాపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏ పార్టీలోకి వెళితే మంచిదని ఆరా తీశారు.

అత్యధికులు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని సూచించారు. తనను వెన్నంటి ఉంటున్న కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటానని కొత్తపల్లి సుబ్బారాయుడు హామీ ఇచ్చారు. త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని ప్రకటించారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు 2004 శాసనసభ ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన ప్రస్తుత కేంద్ర మంత్రి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 17,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆయన యధావిథిగా కాంగ్రెసు శాసనసభ్యుడు అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+