• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్ష్మీపార్వతిపై మరో ఆరోపణ చేసిన కోటి..! చెప్పింది తప్పైతే నడిరోడ్ మీద ఉరి తియ్యండి.

|

లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైసిపి నాయకురాలు లక్ష్మి పార్వతి ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్న తరుణంలో లక్ష్మీపార్వతి దగ్గర పనిచేసిన కోటి అనే అనుచరుడు ఆమె తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ, ఆమె వేధింపులు భరించలేక పోతున్నాను అంటూ పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాదు ఆమె చాట్ చేసింది అని చెప్తున్న వాట్సాప్ చాట్ ను, ఆమె గొంతుతో మాట్లాడింది అని చెప్తున్న ఆడియో రికార్డులను పోలీసులకు ఇచ్చి తనకు రక్షణ కావాలని కోరాడు. దీంతో లక్ష్మీపార్వతి రాజకీయ దురుద్దేశంతోనే తన మీద ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ, ఇది టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర అని విరుచుకు పడింది.

లక్ష్మీ పార్వతితో ప్రాణహాని ఉంది .. కోటి

లక్ష్మీ పార్వతితో ప్రాణహాని ఉంది .. కోటి

ఇదిలా ఉంటే లక్ష్మీ పార్వతి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కోటి అలియాస్ ఆనంద్ తనకు, తన కుటుంబానికి లక్ష్మీపార్వతి తో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అటు లక్ష్మీపార్వతి నుండి, వైసిపి నేతల నుండి ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాడు కోటి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి గత నాలుగేళ్లుగా లక్ష్మీపార్వతి తనకు పరిచయం ఉందని, మొదట్లో ఆమె బాగానే ఉండేదని ఏడాదిన్నరగా చిత్రహింసలు పెడుతున్నదని చెబుతున్నారు.

షాకింగ్ ...లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసు

తల్లి సమానంగా భావిస్తే నీచంగా ఆలోచించిండంటున్న కోటి

తల్లి సమానంగా భావిస్తే నీచంగా ఆలోచించిండంటున్న కోటి

ఆమెను నేను తల్లి సమానంగా చూస్తాం అని, ఆమె కుమారుడు నన్ను సోదరుడిగా చూసేవాడిని చెప్పుకొచ్చాడు కోటి. అయితే కొంతకాలంగా ఆమె వాట్సాప్ మెసేజ్ లు, అశ్లీల వీడియోలు లింకులు పంపిస్తున్నారని చెప్పిన కోటి కొద్ది రోజుల క్రితం నుండి అసలు విషయం చెప్పి తనను హింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక వినుకొండ పోలీసులను ఆశ్రయించడంతో లక్ష్మీపార్వతికి నాకు కామన్ ఫ్రెండ్ గా ఉన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారని చెప్పారు కోటి. అయితే తన జోలికి, తన కుటుంబం జోలికి రాకుండా ఉంటే చాలు అని కోటి పోలీసులను కోరుతున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించింది అంతా అబద్ధమే

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించింది అంతా అబద్ధమే

ఒకపక్క లక్ష్మీపార్వతి రాజకీయ దురుద్దేశంతోనే తన మీద ఏ విధమైన అపవాదులు వేస్తున్నారని ఆరోపిస్తూ ఉంటే, తనకు అలాంటి రాజకీయ దురుద్దేశాలు ఏవీలేవని కోటి చెబుతున్నారు. తాను ఎంతగానో ఆరాధించిన ఎన్టీఆర్ ని సైతం ఆమె చాలా నీచంగా మాట్లాడారని కోటి చెప్పుకొచ్చారు. అంతేకాదు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీపార్వతి గురించి చూపించినదంతా అబద్దమే అని ఆమె లో ఉన్న మరో కోణాన్ని బయటకు చెప్పాలని ఇప్పుడు ఇలా బయటకు వచ్చానని కోటి చెబుతున్నారు.

రాజకీయ దురుద్దేశం అని తేలితే నడి రోడ్ మీద ఎన్కౌంటర్ చెయ్యండి

రాజకీయ దురుద్దేశం అని తేలితే నడి రోడ్ మీద ఎన్కౌంటర్ చెయ్యండి

తాను రాజకీయ దురుద్దేశంతో ఇదంతా చేశాను అని తేలితే తనను నడిరోడ్డు మీద ఎన్కౌంటర్ చేయండంటూ కోటి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు త్వరలోనే అసలు విషయాలు బయటపెడతామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల సమయంలో లక్ష్మీ పార్వతి గురించి చెలరేగిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A shocking and unexpected development in AP politics . a sexual harassment case has been filed on YCP leader Lakshmi Parvathi. A man identified as Koti registered a case on Lakshmi Parvathi alleging that she has been harassing him and has been approaching him inappropriately.Koti also revealed that Lakshmi Parvathi chatted with him in an inappropriate manner. He also provided the WhatsApp chat screenshots were provided the proof of evidence.The complaint has been registered against the YSRCP leader in Vinukonda and Koti sought police security from Lakshmi Parvathi. He alligated that he has threat with YCP leaders and Lakshmi parvathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more