అవమానం జరుగుతోంది, ఇక పెద్దలను కలువం: కోట్ల
న్యూఢిల్లీ: మంత్రుల బృందం (జివోఎం) ముందుకు వెళ్లిన ప్రతిసారి తమకు అవమానం జరుగుతోందని, ఇక నుండి తాము ఢిల్లీ పెద్దలను, జివోఎం సభ్యులను కలువబోమని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయింటుమెంట్ ఇస్తే ఆమెకు వాస్తవాలను చెబుతానన్నారు.
కోట్ల న్యూఢిల్లీలో ఓ టివి ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాయలసీమను చీల్చాలని తమకు ఎవరికీ లేదన్నారు. నీటి కేటాయింపుల్లో న్యాయం చేయాలని మాత్రమే కోరామన్నారు. రాయల తెలంగాణ కోసం తాము ఎలాంటి లాబీయింగ్ చేయడం లేదని చెప్పారు. తనకు కాంగ్రెసు పార్టీని వీడే ఆలోచన లేదన్నారు.

జివోఎం సభ్యులను కలిసినప్పుడల్లా అవమానం జరుగుతోందని, ఇక నుండి వారిని తాము కలువబోమన్నారు. తాము ఏం చెప్పినా వారు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన విషయంలో బాధ్యతాయుతంగా మాట్లాడే నాయకుడే లేరని విమర్శించారు.
జివోఎం భేటీ
విభజనపై వేసిన కేంద్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన పూర్తిస్థాయి జివోఎం సమావేశం కానుంది. గులాం నబీ ఆజాద్ మినహా మిగతా సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. సిఫార్సులతో కూడిన ముసాయిదాను జివోఎం ఇవాళ తుదిరూపు ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications