నంద్యాల ఉపఎన్నికను రద్దు చేయండి: కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపఎన్నికల్లో డబ్బులు వరదలా పారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కుందూ నదిలో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. అయితే ఈ ఉపఎన్నికలను పురస్కరించుకొని నంద్యాలలో డబ్బు ప్రవాహం కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Kotla Suryaprakash reddy demands to cancel Nandyal by poll

డబ్బు ప్రవాహన్ని ఆపడంలో అధికారులు మిన్నకున్నారని ఆయన ఆరోపించారు. నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికపై సూర్య ప్రకాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈసీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికార, విపక్ష పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader former union minister Kotla Suryaprakash reddy demanded to cancel Nandyal by poll.He spoke to a media channel on Thursday.
Please Wait while comments are loading...