వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: తాడేపల్లి గూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విపక్ష పార్టీ వైసీపీలో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. కొట్టు చేరికతో ఏపీలో వైసీపీకి మంచి రోజులొచ్చాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014 ఎన్నికల్లో అధికారం అందినట్టే అంది, చివరకు ఆ పార్టీకి అందకుండానే పోయింది.

చివరి నిమిషంలో టీడీపీ మేజిక్‌తో ఆ పార్టీకి అధికారం దక్కని విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వైపీసీ విపక్ష హోదాను దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా తాను తలచుకుంటే టీడీపీ సర్కారును గంటలో కూలుస్తానంటూ గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ చేసిన వ్యాఖ్య పార్టీని సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసింది.

ఈ వ్యాఖ్యలను ఆసరా చేసుకుని టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. దీంతో వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు కీలక నేతలు టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీ కేడర్ లో నిర్వేదం నెలకొంది. అయితే బుధవారం టీడీపీ నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం తన అనుచరులతో కలసి బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌కు వెళ్లిన ఆయన వైసీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జగన్‌ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొట్టు సత్యనారాయణను పార్టీ నేతలకు స్వయంగా పరిచయం చేసిన జగన్... పార్టీకి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇక నుంచి పార్టీ విజయపథంలో దూసుకుపోతుందని ఆయన ప్రకటించారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నెరవెర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనందున టీడీపీకి చెందిన పలువురు వైసీపీ వైపు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ రూ.600 కోట్లతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఉద్యాన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ పాలిటెక్నిక్‌ వంటి సంస్థలను వెంకట్రామన్నగూడెంలో నెలకొల్పారు. పట్టణంలో రాజీవ్‌ గృహకల్ప సముదాయం, రెండో ఫ్లై ఓవర్‌ వంతెన, ఎర్రకాలువపై వంతెనలు వంటి గుర్తుండిపోయే నిర్మాణాలు చేయించారు.

టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

వైయస్ మరణానంతరం కొంతకాలం పాటు స్తబ్దుగా ఉండిపోయిన సత్యనారాయణ ఆ తరువాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. బీజేపీతో పొత్తు కారణంగా తాడేపల్లి గూడెం టికెట్ ను బీజేపీకి కేటాయించింది టీడీపీ. దీంతో ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

 టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

టీడీపీలో భంగపాటు, వైసీపీలో సాదర స్వాగతం: కొట్టు చేరిక సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్య

ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తానేటి వనిత, ఉంగుటూరు, గోపాలపురం నియోజకవర్గాల కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు పాల్గొన్నారు.

English summary
Kottu Satyanarayana joins YSRCP in presence of YS Jagan at Party Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X