దారికాచి, టిడిపి కౌన్సెలర్ దారుణ హత్య: ఆర్థిక లావాదేవీలా?
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కౌన్సెలర్ హత్య గావింపబడ్డాడు. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయన హత్యకు రాజకీయ కక్షలే కారణం కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు 16వ వార్డు కౌన్సెలర్ గోపాలకృష్ణ. కొవ్వూరుకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగబాద్ అతను ద్విచక్ర వాహనం పైన వెళ్లాడు. తిరిగి అతను కొవ్వూరు వస్తుండగా దుండగులు దారి కాచి అతనిని చంపేశారు. అతను టిడిపి కౌన్సిలర్.

ఇసుక ఆర్థిక లావాదేవీలు కారణమా
అతను బుల్లెట్ పైన కొవ్వూరుకు తిరిగి వస్తుండగా ఈ హత్య జరిగింది. అతని హత్యకు ఇసుక ర్యాంప్ ఆర్థిక లావాదేవీలే కారణం కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. గోపాలకృష్ణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications