జగన్ పార్టీలో చేరుతారని పుకార్లు: కొట్టేసిన కరణం బలరాం

ఒంగోలు: తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం బలరాం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే పుకార్లు ఊపందుకున్నాయి. అయితే, ఆ పుకార్లను కరణం బలరాం కొట్టిపారేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తమని ఆయన స్పష్టం చేశారు.

శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావాలని తనను అడిగే దమ్మూ ధైర్యం ఎవరికీ లేదన్నారు. వైసీపీలో చేరాల్సిన అవసరం, అగత్యం తనకు లేదని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలు బాధించాయని కరణం బలరాం అన్నారు.

Kranam balaram says he is not joining in YSR Congress

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. ఒక కులానికో..వర్గానికో ప్రతినిధి కానని, .ప్రజాప్రతినిధిని అని టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాం తెలిపారు.

కరణం బలరాం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ స్థానికంగా వార్తలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఆ మేరకు ఊహాగానాలు కూడా చెలరేగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+