సెల్ఫీ దిగుతూ అట్లాంటా వాటర్‌ఫాల్స్‌లోకి- అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి..
సెల్ఫీ మోజు ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన ఓ యువతికి ప్రాణాల మీదకు తెచ్చింది. ఉద్యోగం కోసం జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి మృత్యువాత పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు కమల అనే 26 ఏళ్ల యువతి ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసుకుని కొలంబియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. శనివారం అట్లాంటాలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ అక్కడే ఉన్న జలపాతం వద్ద ఆగింది. జలపాతం అందాలు తిలకించాక సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కాలు జారి అందులో పడిపోయింది. తనతో పాటు వెళ్ళిన వారికి కూడా కాపాడే అవకాశం లేకపోవడంతో స్ధానిక పోలీసులకు సమాచారం అందించారు.

Recommended Video
వెంటనే రంగలోకి దిగిన పోలీసులు ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అమెరికాలోని నాట్స్ సంస్ధ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషయం తెలియగానే కృష్ణాజిల్లాలోని ఆమె స్వగ్రామం గుడ్లవల్లేరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమార్తె ఇలా హఠాన్మరణం చెందడంత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications