వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురిపై కాల్పులు: హంతకుల కారు గుర్తింపు

|
Google Oneindia TeluguNews

Krishna police identified murderers used car at Hanuman Junction
కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులకు పాల్పడిన దుండుగులు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. వాహనంలో ఉన్న కత్తులు, రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు గత మూడు రోజులుగా హనుమాన్ జంక్షన్‌లోని రాయల్ హంపీ హోటళ్లో బస చేసినట్లు సమాచారం.

దుండగులు మహేంద్ర ఎస్‌యువి కారుకు పల్సర్ బైక్ నెంబరును వేసి కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది. కాల్పులు జరిగిన అనంతరం హనుమాన్‌జంక్షన్‌లోని హోటల్ వెనకాల కారును వదిలి నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై జిల్లా డిఎస్పీ విచారణ జరుపుతున్నారు. పాతకక్షల వల్లనే కాల్పుల ఘటన జరిగిందని విజయవాడ సీపీ వెంకటేశ్వర రావు తెలిపారు.

దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు చిన్న కడిమికి చెందిన గంధం మారయ్య, పగిడి మారయ్య, నాగేశ్వర రావు. గంధం మారయ్య. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘటనతో భయాందోళనకు గురైన డ్రైవర్ ఏలూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలంలో పోలీసులు 5 తుటాలు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, నిందితులు కాల్పులు జరపడంతో భయపడి తాను పారిపోయి వచ్చానని ఏలూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయిన కారు డ్రైవర్ తెలిపాడు. తాను విమానాశ్రయంలో ఓ ముసలాయన, మరో ఇద్దరిని ఎక్కించుకున్నానని, గన్నవరం వద్ద తమకు ముందు ఓ కారు వచ్చిందని డ్రైవర్ చెప్పాడు. తమకు గన్నవరం దాటే వరకు ఆ కారు దారి ఇవ్వలేదని చెప్పాడు. ముందు కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆపేశానని, అనంతరం వారు వచ్చి కాల్పులు జరిపారని, దాంతో తాను భయపడి పారిపోయానని డ్రైవర్ చెప్పాడు. కాల్పులు జరిపిన వారు టక్ చేసుకొని నీట్‌గా వచ్చారని తెలిపాడు.

English summary
Krishna police identified murderers, who has attacked with guns on three persons used car at Hanuman Junction on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X