విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదో అంతస్తు నుంచి పడిన లిఫ్ట్, కృష్ణా పుష్కరాల్లో పాము కాటు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ భవానీపురంలోని భవానీ టవర్స్‌లో సోమవారం నాడు లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకు పడింది. దీంతో లిఫ్టులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

వారు పుష్కరాల కోసం విజయవనగరం నుంచి వచ్చారు. లిఫ్టు ఎక్కాగా.. కేబుల్ వైర్లు తెగి పడటంతో ఒక్కసారిగా లిఫ్టు కింద పడింది. పరిమితికి మించి మంది ఎక్కడంతో ఇది జరిగిందని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి కారణం బిల్డర్ అమర్నాథ్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. అతని పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Krishna Pushkaralu: Lift accident in Vijayawada

పుష్కర స్నానం చేస్తూ నీటమునిగిన విద్యార్థి

కృష్ణా పుష్కరాల నాలుగో రోజు విజయవాడలో అపశృతి చోటు చేసుకుంది. ఫెర్రి ఘాట్‌లో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ యశ్వంత్ అనే బీటెక్ విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన వాడు.

దుర్గా ఘాట్‌లో విద్యార్థికి పాముకాటు

కృష్ణా జిల్లాలోని దుర్గా ఘాట్‌లో పుష్కర స్నానం చేస్తున్న ఓ విద్యార్థిని పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందిస్తున్నారు. పాముకాటుకు గురైన విద్యార్థి విజయవాడ కొత్తపేటకు చెందిన సుమంత్‌గా తెలుస్తోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా మట్టపల్లి వద్ద కూడా ఓ పాము ఒకరిని కాటు వేసింది.

విజయవాడ భవానీపురంలోని భవానీ టవర్స్‌లో సోమవారం నాడు లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకు పడింది. దీంతో లిఫ్టులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

English summary
Eight members injured in lift accident in Krishna district Vijayawada on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X