హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెను ప్రమాదమే: 'కృష్ణా, కొండవీటి వరదలతో అమరావతికి ముప్పు తప్పదు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: కృష్ణా నది, కొండవీటి వాగులకు వరదలు వస్తే నవ్యాంద్ర రాజధాని అమరావతికి పెనుముప్పు సంభవించే ప్రమాదముందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు.

అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం వాదనలు జరిగాయి. జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కృష్ణా నది, కొండవీటి వాగుకు వరదలొస్తే అమరావతికి ముప్పు అన్నారు.

భారీ వర్షాలు, వరదలు వస్తే విజయవాడది చెన్నై పరిస్థితేభారీ వర్షాలు, వరదలు వస్తే విజయవాడది చెన్నై పరిస్థితే

'Krishna River and Kondaveeti Vagu poses challenge for Capital'

శివరామకృష్ణన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిందని న్యాయవాది చెప్పారు. వరదలు వస్తే అమరావతికి పెను ప్రమాదం తప్పదన్నారు.

వాదనల అనంతరం ప్రభుత్వం విచారణను వచ్చే నెల (సెప్టెంబర్ 9)కి వాయిదా వేసింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని చేపట్టిందని ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్ ఆరోపించారు. ఎన్జీటీ విచారణకు ఆమె కూడా హాజరయ్యారు.

English summary
'Krishna River and Kondaveeti Vagu poses challenge for Capital'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X