తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీ.. కృష్ణయ్య కసరత్తులు..
తెలుగు రాష్గ్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. బీసీ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేత్రుత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆర్.కృష్ణయ్య పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను స్వయంగా వెల్లడించారు.
పార్టీ ఏర్పాటు గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పార్టీలన్ని అగ్ర కులాల నీడల్లోనే నడుస్తున్నాయని, బీసీలకు రాజ్యాధికారం కావాలంటే సొంతంగా పార్టీ ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పిన ఆయన పార్టీతో కలిసి వచ్చే ఎవరినైనా సరే కలుపుకుపోతామని చెప్పారు.
కాగా.. ఏపీలో కాపులకు రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోననే అనుమానంలో ఉన్నారు బీసీ నేతలు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న నిబంధన ఉన్న నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించడానికి ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకా చాలా సమయం ఉన్నా..! బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం ఎక్కడ కోత పెడుతుందోనన్న ఆందోళనలో ఉన్నాయి బీసీ వర్గాలు.

ఈ నేపథ్యంలోనే బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే సొంత రాజకీయ పార్టీతోనే సాధ్యమని భావిస్తున్నారు కృష్ణయ్య. ఇదే క్రమంలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బీసీలందరిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కూడా కృష్ణయ్య చర్చించబోతున్నట్టుగా సమాచారం.
పార్టీ గురించి మరిన్ని విషయాలు ప్రస్తావిస్తూ.. బీసీల ఆత్మగౌరవం కోసమే నూతన రాజకీయ పార్టీ అని ప్రకటించిన ఆర్.కృష్ణయ్య, బీసీలకు తప్పనిసరిగా 50% రాజకీయ రిజర్వేషన్లు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే బీసీ సబ్‌ప్లాన్ కింద కేంద్రం లక్ష కోట్ల నిధిని ఏర్పాటుచేయాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం కాపులకు బీసీలకు మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఆర్.కృష్ణయ్య.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications