కర్నూలు గర్జన: సీమకు రాజధాని కావాల్సిందే - చంద్రబాబుపై బైరెడ్డి సెటైర్లు..!!
Kurnool Garjana: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సమ న్యాయం - సమ పాలన ముఖ్యమంత్రి విధానమని స్ఫష్టం చేసారు. కర్నూలు వేదికగా న్యాయ రాజధాని డిమాండ్ తో జేఏసీ గర్జన నిర్వహించింది. ఇందులో సీమ ప్రాంతానికి చెందిన మంత్రలు..వైసీపీ నేతలు హాజరయ్యారు. అనేక రంగాలకు చెందిన సీమ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. 1973లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఇప్పటికైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ రాజధాని చేయాలని నేతలు డిమాండ్ చేసారు. వికేంద్రీకరణ అడ్డుకుంటే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పైన వైసీపీ నేతలు మండిపడ్డారు.
నష్టోయిన సీమ వాసులకు మద్దతుగా...
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనేదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఏపీ మంత్రులు స్పష్టం చేసారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన చేపట్టామన్నారు. చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.
కుప్పాన్ని అన్ని విధాల సీఎం వైయస్ జగన్ అభివృద్ధి చేశారు..ఇందుకు ఇటీవల నిర్వహించిన ఎన్నికలే నిదర్శమన్నారు. కర్నూలుకు వచ్చి న్యాయ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఆ మూడు సీట్లు కూడా రావని వైసీపీ నేతలు హెచ్చరించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబుకు ఈ ప్రాంత అభివృద్ధిపై అసలు చిత్తశుద్ధి లేదన్నారు.
సీమకు న్యాయం జరగాలంటే..
దశాబ్దాల కాలంగా అన్నింటా నష్టపోతున్న రాయలసీమకు న్యాయం జరగాలంటే మూడు రాజధానుల్లో ఒకటిగా కర్నూలును డెవపల్ చేయాలని నేతలు డిమాండ్ చేసారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే ఆరాట పడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. రాయల సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని మంత్రి ఉషశ్రీ చరణ్ కొనియాడారు. రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని మంత్రి విమర్శించారు.
అమరావతి ఏకైక రాజధానికి తాము ఒప్పుకునేది లేదన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి తాము మోసపోయేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు.
చంద్రబాబు బైరెడ్డి సిద్దార్దరెడ్డి వ్యాఖ్యలు..
రాజధాని అడిగే హక్క ఏపీలో రాయలసీమ వాసులకే ఉందని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులది త్యాగం అయితే, శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి సీమ ప్రాంత రైతులె ఎంతో త్యాగం చేశారని సిద్దార్ద రెడ్డి గుర్తు చేసారు. తమది త్యాగం కాదా అని ప్రశ్నించారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం..తమ ప్రాంతానికి గుర్తింపు కోసం రాజధానిని కోరుతున్నామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు.
రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. ఎంతో మంది సీమప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు పని చేసినా..ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం సీమ ప్రాంతానికి మేలు చేస్తుందన్నారు. అందరం సీఎం జగన్‌కు మద్దతుగా ఉందామని, కర్నూలుకు న్యాయ రాజధానిని సాధించుకుందామని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications