ఏపీ నెక్స్ట్ సీఎస్ జవహర్ రెడ్డి..!! రేసులో సహానీ-శ్రీలక్ష్మి : సీఎం జగన్ చూపు ఎవరి వైపు..!!

ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ వచ్చే నెల నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. మూడు నెలల పదవీ కాలం పొడిగింపుతో సెప్టెంబర్ 30తో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో...తరువాత కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లొ మొదలైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సహానీ ఇప్పుడున్న అధికారుల్లో సీనియర్ గా ఉన్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. ఆయన సతీమణి నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.

 తెర మీదకు అజయ్ సహానీ పేరు..

తెర మీదకు అజయ్ సహానీ పేరు..

అయితే, ఆయనకు సీఎస్ గా అవకాశం ఇస్తే ఏపీకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వద్ద అజయ్ సహానీ ముఖ్య కార్యదర్శిగా పని చేసారు. ఆ తరువాత తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆయనకు సాధ్యం కాకుంటే 1985 బ్యాచ్ కు చెందిన శమీర్ శర్మ..రెడ్డి సుబ్రమణ్యం ఉన్నారు. వీరిద్దరి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, 1986 బ్యాచ్ కు చెందిన సతీష్ చంద్ర సైతం ఉన్నప్పటికీ..ఆయన చంద్రబాబు వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.

శ్రీలక్ష్మీ పేరు రేసులో...సర్వీసు ఎక్కువగా ఉండటంతో..

శ్రీలక్ష్మీ పేరు రేసులో...సర్వీసు ఎక్కువగా ఉండటంతో..

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కాలం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తరువాత కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఇక, 1987 బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్ సైతం రేసులో ఉన్నారు. ఆయన పేరు సైతం ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో జగన్ కేసుల్లో సీబీఐ అభియోగాలు..జైలు శిక్ష ఎదుర్కొన్న శ్రీలక్ష్మి పేరు సైతం ప్రచారంలోకి వచ్చింది. అయితే, 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి ఇంకా చాలా కాలం సర్వీసు ఉండటంతో ఇప్పుడు అవకాశం దక్కుతుందా లేక, తరువాత పరిగణలోకి తీసుకుంటారా అనేది చూడాలి.

 తొలి స్థానంలో జవహర్ రెడ్డి పేరు..

తొలి స్థానంలో జవహర్ రెడ్డి పేరు..

జగన్ సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత ఏరి కోరి శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ ను తప్పించి ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు చేసారు. ఇప్పటికే రెండు ప్రమోషన్లతో స్పెషల్ చీస్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఇదే 1988 బ్యాచ్ కు చెందిన పూనం మాలకొండయ్య సైతం సీనియర్ గా ఉన్నా...ఆమెకు అవకాశాలు లేనట్లుగానే అధికారవర్గాల్లో ప్రచారం సాగుతోంది. పూనం మీద ఆరోగ్య శాఖ పర్యవేక్షించిన సమయంలో కొన్ని అభియోగాలు ఉన్నాయి. దీంతో..పూనంకు సీఎస్ గా ఛాన్స్ లేనట్లేనని చెబుతున్నారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది.

జవహర్ కు ఛాన్స్ దక్కుతుందంటూ..

జవహర్ కు ఛాన్స్ దక్కుతుందంటూ..

1990 బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి 1009లో వైఎస్సార్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎంకు రావాలని వైఎస్సార్ కోరారు. అందుకు రంగం సిద్దమైంది. అదేశాలు వెలువడాల్సిన సమయంలో వైఎస్సార్ మరణించారు. జవహర్ రెడ్డి ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేసారు. ఇక, జగన్ సీఎం అయిన తరువాత కీలకమైన ఆరోగ్య శాఖను నిర్వహించారు. కోవిడ్ -19 నిర్వహణలో జవహర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో సీఎం ప్రశంసలు అందుకున్నారు.

సీఎం చూపు..జవహర్ వైపేనా..

సీఎం చూపు..జవహర్ వైపేనా..

ఫలితంగా కోరుకున్న విధంగా టీటీడీ ఈవోగా అవకాశం దక్కించుకున్నారు. అయితే, సెకండ్ వేవ్ తీవ్రతతో టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డికి ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలను సీఎం అప్పగించారు. ఇక, వచ్చేది ఎన్నికల కాలం కావటంతో ఆయన వైపే సీఎం జగన్ సైతం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే...2024 వరకు జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. దీంతో..సీఎస్ పదవి దక్కించుకొనేందుకు సీనియర్ అధికారులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండగా...సీఎం జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+