ఒకే లక్ష్యంతో అమెరికా టూర్: లోకేష్ 10రోజులు, కేటీఆర్ 15రోజులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ పది రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆయన సమావేశాలు ఉంటాయి. ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఆమెరికాలోని పలు ప్రాంతాల్లో లోకేష్ పర్యటిస్తారు.
ఈ సందర్భంగా పలు బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లతోను లోకేష్ సమావేశం అవుతారు.
తెలంగాణలో పెట్టుబడుల కోసం కేటీఆర్

తెలంగాణకు భారీగా పెట్టుబడులను తీసుకు రావడమే లక్ష్యంగా మే 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండు వారాల పాటు అమెరికాలో పర్యటిస్తారు. ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ప్రవాస భారతీయులను కలుస్తారు.
ఈ మేరకు గురువారం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని మంత్రి పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తారని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రక్షణ రంగాలపై ప్రత్యక దృష్టి సారించనున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, డల్లాక్ తదితర నగరాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications