అంతా రివర్స్!: అదీ చంద్రబాబు సత్తా, జగన్‌కు ఊహించని షాకిచ్చిన కేటీఆర్!!

Recommended Video

    ఘనతంతా చంద్రబాబుదే : కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

    హైదరాబాద్: భాగ్యనగరానికి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని తీసుకు వచ్చిన ఘనత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిదే అన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. అమరావతిని కూడా అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు.

    టెక్ మహీంద్రాలో గురువారం జరిగిన మిషన్ ఇన్నోవేషన్ 2018లో కేటీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే. గత 17 ఏళ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించిందని, నగరంలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు ఘనత చంద్రబాబుకే దక్కుకుతుందని పేర్కొంటూ అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.

     అమరావతిపై జగన్, బాబుపై తెరాస విమర్శలు

    అమరావతిపై జగన్, బాబుపై తెరాస విమర్శలు

    నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, ఇక రాజధాని ఏం కడతారని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబును గతంలో పలుమార్లు విమర్శించారు. వర్షం వస్తే రోడ్లపై నిలిచే నీరు.. ఇదేనా బాబు చేసిన అభివృద్ధి, సైబరాబాద్‌ను చూపిస్తే సరిపోతుందా అని విపక్షాలన్నీ విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

     అమరావతిని కూడా ముందుకు తీసుకు వెళ్తారని

    అమరావతిని కూడా ముందుకు తీసుకు వెళ్తారని

    అలాంటిది ఎవరూ ఊహించని విధంగా మంత్రి కేటీఆర్.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేనిది అని వారు కూడా అంగీకరిస్తున్నారు. కేటీఆర్ అమరావతి అభివృద్ధిపై కూడా మాట్లాడారు. హైదరాబాదును అభివృద్ధి చేసిన చంద్రబాబు అమరావతిని కూడా ముందుకు తీసుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు.

    కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీ విపక్ష నేతలకు షాక్

    కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీ విపక్ష నేతలకు షాక్

    నిన్నటి వరకు చంద్రబాబుపై మండిపడిన టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేటీఆర్ హైదరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పడం, అమరావతిని అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించడం ఓ విధంగా ఏపీలోని విపక్ష నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి వారికి షాక్ అని చెప్పవచ్చు.

     అదీ చంద్రబాబు సత్తా!

    అదీ చంద్రబాబు సత్తా!

    ఈ వ్యాఖ్యలు ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడానికి ఉపకరిస్తాయి. పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని స్వయంగా కేటీఆర్ చెప్పారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే ఆలోచనతో 2014లో మద్దతిచ్చారని, ప్రజలు కూడా అప్పుడు అందుకే ఓటు వేశారని, ఇప్పుడు స్వయంగా తెలంగాణ మంత్రి చెప్పారని, అదీ చంద్రబాబు సామర్థ్యం అని టిడిపి నేతలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

     కేటీఆర్ వ్యాఖ్యలతో తిప్పికొట్టే అవకాశం

    కేటీఆర్ వ్యాఖ్యలతో తిప్పికొట్టే అవకాశం

    అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తే కేటీఆర్ వ్యాఖ్యలతో తిప్పికొట్టే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. రాజధాని నిర్మాణం అంటే అంత సులభం కాదని, ప్రణాళికా బద్దంగా ముందుకు తీసుకు వెళ్తున్నామని టిడిపి నేతలు.. జగన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు కేటీఆర్ వ్యాఖ్యలు దోహదపడనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+