దిక్కుతోచకే, వదిలేది లేదు - కేటీఆర్ సంచలనం..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా ఈటల రాజేందర్, హరీష్ కు నోటీసులు జారీ చేసింది. కమిషన్ కాల పరమితి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం పైన పార్టీ ముఖ్య నేత లతో కేసీఆర్ కీలక మంత్రాంగం నిర్వహించారు. నోటీసులకు అనుగుణంగా కేసీఆర్ విచారణకు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇదే సమయంలో ఇదే వ్యవహారం పైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
తమకు చట్టాలు.. న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చప్పుకొచ్చారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ధైర్యం ఎదుర్కొంటామని స్పష్టం చేసారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే నోటీసులు.. ప్రజా సమస్యలను గాలికొదిలి నోటీసులు ఇస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదు.. కమీషన్ల పాలన అని కేటీఆర్ వ్యాఖ్యానిం చారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది అని ధ్వజమెత్తారు. కమీషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదని విమర్శించారు.

డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమీషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోతే అక్కడ సహాయక చర్యలు చేపట్టలేదని.. కమీషన్ ల ఆరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని ధ్వజమెత్తారు. నల్గొండలో సుంకిశాల ప్రాజెక్ట్ కూలింది, ఇప్పటికీ ప్రభు త్వం స్పందించలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications