షర్మిలపై ప్రచారం మీద కెటిఆర్ సీరియస్, ఛానళ్లపై జానా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం స్పందించారు. షర్మల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామన్నారు. షర్మిల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే కమిషనరేట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి స్పందించాలని కోరామన్నారు.

అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విషయంలో కూడా చురుగ్గా స్పందించాలని కోరామన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తే వారిని చట్టానికి లోబడి శిక్షిస్తామన్నారు. సైబర్ నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై జానారెడ్డి
ఆంధ్రజ్యోతి, టీవీ9 ఛానళ్ల ప్రసారాల నిలిపివేతను తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత జానా రెడ్డి బుధవారం ఖండించారు. ఇది ప్రతీకారచర్యగా భావించవలసి ఉంటుందన్నారు. టీవీ ఛానళ్ల నిలిపివేత సరికాదన్నారు. మీడియా పైన ఆంక్షలు సరికాదని, అదే సమయంలో మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలన్నారు. ఎవరికి ఎవరు తాబేదార్లు కాదన్నారు. కాగా, ఇరు రాష్ట్రాలు విద్యుత్‌ను చట్టపరంగా ఉపయోగించుకోవాలన్నారు. కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications