ఏం హైప్ ఇచ్చార్రా బై..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ భేటీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్- కేటీఆర్ కు సంబంధించిన ఫొటోలు ఈ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లల్లో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి. ఆయా పార్టీల అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధుల కామెంట్లతో వైరల్ అయ్యాయి.
వైఎస్ జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు శివార్లలోని తరహుణిసెలో సర్జ్ స్టేబుల్స్‌లో ఏర్పాటైన ఓ ప్రైవేట్ ఈవెంట్ కు హాజరయ్యారు. అదే కార్యక్రమంలో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫైనల్‌కు వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇండియన్ షో జంపింగ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ ఏర్పాటైంది. ఈ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ రైటర్లు పాల్గొన్నారు.

ఇంటర్నేషనల్ కేటగిరీలో ఎడ్వర్డ్ ష్మిట్జ్, అనస్తాసియా బోండారివా, జైన్ షాజీ సమీర్, వాలెంటిన్ మార్కాట్ వంటి నలుగురు రైడర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు వైఎస్ జగన్, కేటీఆర్. ఈవెంట్ ఆరంభం నుంచి ముగిసిపోయేంత వరకూ ఇద్దరూ కలిసే ఉన్నారు. సరదాగా మాట్లాడుతూ కనిపించారు. రాజకీయాలతో బిజీగా గడిపే ఈ ఇద్దరు పొలిటికల్ జెయింట్లు.. ఇక్కడ కలివిడిగా గడిపారు.
వైఎస్ జగన్ తో సమావేశం కావడంపై తాజాగా స్పందించారు కేటీఆర్. ఆయనను అన్న గా సంబోధించారు. ఈ భేటీ గొప్పగా జరిగిందని అన్నారు. బెంగళూరులో ఓ ప్రైవేట్ ఈవెంట్ లో జగన్ అన్నను కలుసుకోవడం గొప్పగా అనిపించిందని కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్- కేటీఆర్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లల్లో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి. 2028లో కేటీఆర్, 2029లో వైఎస్ జగన్ మళ్లీ తమ తమ రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతోన్నారనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
Was great meeting @ysjagan Anna at a private event in Bengaluru pic.twitter.com/8Ix5wPzr8M
— KTR (@KTRBRS) November 23, 2025












Click it and Unblock the Notifications