కునాల్ ఘోష్ ఇష్యూ: మీడియాతో పోలీసుల ఘర్షణ
కోల్‌కతా: ఎస్ఎస్‌కెఎం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడదు కునాల్ ఘోష్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులు మీడియా ప్రతినిధులతో ఘర్షణ పడ్డారు. శనివారం సాయంత్రం కునాల్ ఘోష్‌ను ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
నిద్రమాత్రలు మింగి జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కునాల్ ఘోష్ ఆస్పత్రి నుంచి శనివారం విడుదలయ్యారు. పోలీసులు ఘోష్‌ను ఆస్పత్రికి తీసుకుని వెళ్తుండగా మీడియా ప్రతినిధులు పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. ఘోష్‌తో మాట్లాడడానికి ప్రయత్నించారు.

అప్పటికే తీవ్రమైన ఒత్తిడితో ఉన్న పోలీసులు మీడియా ప్రతినిధులను నెట్టేయడానికి ప్రయత్నించారు. మీడియాతో ఘోష్ మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శారదా స్కామ్‌లో అసలైన నిందితులను అరెస్టు చేయాలని ఘోష్ శనివారం ఉదయం డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు నిద్రమాత్రలు మింగి కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఆయనకు ప్రాణహాని లేదని అప్పుడే వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జైలు సూపరింటిండెంట్‌ను, వైద్యుడిని, విధుల్లో ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications