కుప్పంలో కౌంట్ డౌన్, వైసీపీ కీలకనేత అందర్, చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పాత కేసులు తోడటానికి సిద్దం అయ్యింది. గతంలో నమోదు అయిన కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలోని కుప్పం పోలీసులు వైసీపీకి చెందిన నాయకుడిని అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన నాయులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒత్తిడితో వైసీపీకి చెందిన నాయకుల మీద కేసులు నమోదు చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి

అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో కూడా వైసీపీ నాయకుల మీద కొన్ని కేసులు నమోదు అయ్యాయి. కుప్పంలో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ మీద ఓ కేసు నమోదు అయ్యింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 50 రోజులు అవుతున్నా వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్టు చెయ్యలేదు.
ఆదివారం అర్దరాత్రి వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలో నమోదు అయిన ఓ కేసుకు సంబంధించి నాగార్జున యాదవ్ ను విచారించడానికి అతన్ని కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ కు 41ఏ నోటీసులు జారీ చేసి తరువాత చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులు డిసైడ్ అయ్యారని తెలిసింది. గతంలో సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద నాగార్జన యాదవ్ అనేక ఆరోపణలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications