కుప్పం వద్ద భారీ ప్రాజెక్ట్- ఎయిర్ క్రాఫ్ట్ హబ్.. !!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్నం సమ్మిట్ లో వేల కోట్ల రూపాయలతో కూడిన పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిల్లో కొన్ని ఒప్పందాలు కార్యాచరణలోకి వస్తోన్నాయి.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రామకుప్పం మండలం మనెంద్రంలో పెట్టబడులు పెట్టడానికి పయనీర్ క్లీన్ యాంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. హంస-3 (ఎన్జీ) టూ సీటర్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, నిర్వహణ, విమానయాన శిక్షణ కేంద్రాన్ని ఈ సంస్థ ఇక్కడ నెలకొల్పబోతోంది. సమగ్ర విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పయనీర్ క్లీన్ యాంప్స్ సంస్థకు మొత్తం కు 55.47 ఎకరాల భూమి కేటాయిస్తూ పారిశ్రామిక, వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా 159 కోట్ల రూపాయల పెట్టుబడి రానుంది. 250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ఈ కేంద్రం- విమానాల ఉత్పత్తి, నిర్వహణ, విక్రయానంతర సేవలు, పైలట్ శిక్షణను అందిస్తుంది.
ఏటా 108 టూ- సీటర్ విమానాలను ఉత్పత్తి చేయాలని ఈ సంస్థ ప్రాథమికంగా నిర్ణయించింది. దేశీయ, అంతర్జాతీయ పైలెట్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూషన్స్, ఏరో క్లబ్స్ యజమానుల అవసరాలకు అనుగుణంగా ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, ఇతర పరికరాలను తయారు చేస్తుందీ సంస్థ. ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయం వద్ద భూమి కావాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది. వీటిని ఎస్ఐపీబీ ఆమోదించింది.
మొత్తం ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తవుతుంది. మొదటి దశలో 28.30 ఎకరాల్లో రూ. 61.11 కోట్ల వ్యయంతో 2027 ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. దీనివల్ల 100 మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో 27.17 ఎకరాల్లో 95.04 కోట్ల రూపాయలతో 2030 జూలై కల్లా పూర్తవుతుంది. 150 మందికి ఉపాధిని కల్పిస్తారు. గతంలో హిందాల్కో ఇండస్ట్రీస్ కుప్పంలో దాదాపు 586 కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమను నెలకొల్పనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications