కర్నూలు బస్సు దుర్ఘటన.. బస్సుపై 16చలాన్లు, ఫిట్నెస్ పైన సంచలన నివేదిక!
కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ చేసిన తప్పే కారణమని పలువురు భావిస్తున్నారు.
బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ తప్పిదం
ఈ ఘటనలో తొలుత బైక్ ను ఢీ కొట్టిన వెంటనే బస్సు ఆపలేదని, మంటలు చెలరేగిన వెంటనే వాటిని నీటితో ఆర్పే ప్రయత్నం చేశారని, మంటలను నియంత్రించే ఫైర్ ఎస్టింగ్విషర్ వంటివి బస్సులో ఉన్నప్పటికీ అతను వాడలేదని భావిస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో హైడ్రాలిక్ తీగలు తెగిపోయి, దాంతో మెయిన్ డోర్ తెరుచుకోలేదని ఈ కారణంగానే ఇరవై మందికి పైగా అగ్నికి ఆహుతయ్యారని భావిస్తున్నారు.

ప్రమాదానికి గురైన బస్సుపై 16 పెండింగ్ చలాన్ లు
ప్రమాద తీవ్రత నేపథ్యంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు పారిపోయినట్టు గా చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గురైన బస్సు పైన తెలంగాణ రాష్ట్రంలో 16 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 23 వేల 120 రూపాయల విలువైన చలాన్లు పెండింగ్లో ఉన్నాయని సమాచారం.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పైన బస్సుపై చలాన్ లు
2024 జనవరి 27 నుండి 2025 అక్టోబర్ 9 మధ్య ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని, తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించిందని అందుకే ఫైన్ విధించినట్టు గా చెబుతున్నారు. అంతేకాదు మితిమీరిన వేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్ నిబంధనల ఉల్లంఘనల పైన కూడా చలాన్లు నమోదు అయినట్టుగా అధికారులు వెల్లడించారు.
బస్సు ఫిట్ నెస్ పైన రవాణా శాఖ చెప్పింది ఇదే
ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన DD01 N9490 బస్సు రిజిస్ట్రేషన్ వివరాలను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెల్లడించింది. రవాణా శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బస్సుకు ఫిట్నెస్ ఉందని, బస్సు బైక్ ని బలంగా ఢీ కొట్టడం వల్లనే బస్సులో మంటలు చెలరేగాయని తెలిపారు. కావేరీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ బస్సు 2018 మే 2న డయ్యు డామన్ లో నమోదు చేశారని పేర్కొన్నారు.
అప్పటివరకు బస్సుకు టూరిస్ట్ పర్మిట్.. అన్ని కోణాల్లో దర్యాప్తు
2030 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ బస్సుకు టూరిస్ట్ పర్మిట్ ఉందని, అలాగే 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉందని తెలిపారు. 2026 ఏప్రిల్ 20 వరకు దీనికి ఇన్సూరెన్స్ ఉందని, బస్సుకి ఫిట్నెస్ విషయంలో ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు. ఈ ఘటన పైన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందని, భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.
-
13 మంది సజీవ దహనం, మార్కాపురంలో మృత్యుఘోష.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications