కర్నూలు బస్సులో 20మంది సజీవదహనం ఘటన.. వారికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి!
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకుని 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయిన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురయ్యింది. ఈ బస్సు ప్రమాద ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
బస్సులో ప్రయాణికుల సజీవ దహనం ఘటనపై పవన్ కళ్యాణ్
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్ కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై, ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 20మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

రవాణా శాఖ వారికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్ కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై, ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మృతుల…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 24, 2025
బస్సు దగ్ధం ఘటనపై స్పందించిన హోం మంత్రి వంగలపూడి అనిత
మరోవైపు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కర్నూలు జిల్లా, చిన్నటేకూరు గ్రామం సమీపంలో జరిగిన దురదృష్టకరమైన బస్సు అగ్ని ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు ప్రమాద ఘటనపై కంట్రల్ రూమ్స్ ఏర్పాటు
— Anitha Vangalapudi (@Anitha_TDP) October 24, 2025
కర్నూలు కలెక్టరేట్ - 0858 -277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి - 9121101059
ఘటనా స్థలం వద్ద కంట్రోల్ రూమ్ -9121101061
కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్ -9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్… pic.twitter.com/HJsyDl5Fb4
స్పందించిన తెలంగాణా సీఎం.. కీలక ఆదేశం
బస్సులో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శి, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్‌ను సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
— Revanth Reddy (@revanth_anumula) October 24, 2025
ప్రమాదంలో పలువురు మృతి చెందారన్న వార్త తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబాలకు నా ప్రగాఢ…
స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్
కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరమని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన కోరారు.
-
కేరళ గడ్డపై సీఎం సవాల్! మా గ్యారంటీలపై డౌట్ ఉంటే తెలంగాణ రండి -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications