కర్నూలు జిల్లాలో ఆటవిక ఘటన .. భార్యను కాపురానికి పిలిచినందుకు మర్మాంగం కోసి ఆపై ..

కర్నూలు జిల్లాలో ఆటవిక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి, అతని మర్మాంగాన్ని కోసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అత్యంత జుగుప్సాకరంగా జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

ఇక అసలు విషయానికి వస్తే కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురం లో జరిగిన ఈ ఘటనలో మూడు సంవత్సరాలుగా పుట్టింటికి పరిమితమైన భార్యను కాపురానికి రమ్మని పిలిచేందుకు భర్త ఆమె పుట్టింటికి వెళ్ళాడు. ఇక అక్కడ భార్య తరపు బంధువులు అతనిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు తాడుతో కట్టేసి అత్యంత కిరాతకంగా అతనిని హింసించారు.

Kurnool district A man brutally harrassed by his wifes relatives

ఇక అంతటితో ఆగకుండా అతని మర్మాంగాన్ని కోసేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సభ్య సమాజం షాక్ కు గురయ్యేలా అత్యంత అమానవీయంగా చోటు చేసుకున్న ఈ ఘటన కర్నూలు జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+