వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jobs: కర్నూలు జిల్లా వైద్య శాఖలో భారీగా కొలువుల భర్తీ..!

|
Google Oneindia TeluguNews

వైద్య శాఖలో కొలవుల జాతర కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో వెయ్యికి పైగా ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల్లో ఏఎన్‌ఎంలను ఇప్పటికే నియమించింది. వీరంతా సచివాలయాల పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించడమే గాక ప్రాథమిక చికిత్సను సైతం అందిస్తున్నారు. గ్రామాల్లో వారి పరిధిలోకి వచ్చే ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు, ఆరోగ్యశ్రీ సేవలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.

సర్వజన వైద్యశాల
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఒకే ఏడాదిలో 385 పోస్టులు వివిధ కేడర్లలో భర్తీ అయ్యాయి. అందులో స్టాఫ్‌నర్సులు 298, గ్రేడ్‌-2 ఫార్మాసిస్టు 15, రిసెప్షనిస్టు కమ్‌ క్లర్క్‌ 3, చైల్డ్‌ సైకాలజిస్టు 1, ఫిజియోథెరపిస్ట్‌ 2, థియేటర్‌ అసిస్టెంట్‌ 6, గ్రేడ్‌-2 ల్యాబ్‌టెక్నీషియన్‌ 19, రేడియోగ్రాఫర్‌ 1, డేటా ఎంట్రీఆపరేటర్స్‌ 3, బయోమెడికల్‌ ఇంజనీర్‌ 1, రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌ 1, కార్డియాలజి టెక్నీషియన్‌ 1, డెంటల్‌ టెక్నీషియన్‌ 1, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ 4, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ 1, ఎక్స్‌రే అటెండెంట్‌ 1, ఆప్టోమెట్రిస్ట్‌ 1, కేథలాబ్‌ టెక్నీషియన్‌ 2, స్పీచ్‌థెరపిస్ట్‌ 2, ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌ 2, సీటీ టెక్నీíÙయన్‌ 2, డయాలసిస్‌ టెక్నీషియన్‌ 5, ఆడియోమెట్రి టెక్నీషియన్‌ 1, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ 4, స్ట్రెచ్చర్‌ బేరర్‌ 6, అటెండర్‌ 2 పోస్టులున్నాయి.

 Kurnool district medical department has a large number of replacements
అర్బన్‌హెల్త్‌ సెంటర్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 మాత్రమే అర్బన్‌హెల్త్‌ సెంటర్లు ఉండేవి. వాటిని 40కి పెంచడమే గాక అందులో పోస్టులను సైతం ప్రభుత్వమే భర్తీ చేసి నిర్వహిస్తోంది. గ్రామాల్లో పీహెచ్‌సీల మాదిరిగా పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఆయా పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌లు ఇలా అన్ని ఆరోగ్య కేంద్రాలకు కలిపి గత రెండేళ్ల నుంచి 600లకు పైగా స్టాఫ్‌నర్సులను నియమించారు. దాంతో పాటు మరో 200 మంది ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల పోస్టులను భర్తీ చేశారు. 200లకు పైగా నాల్గో తరగతి ఉద్యోగులనూ నియమించారు. వీరితో పాటు మరో 200 మంది దాకా పారామెడికల్‌ సిబ్బందిని నిమించుకోనున్నారు.
 Kurnool district medical department has a large number of replacements
English summary
The Kolavula Jatra is going on in the medical department. ANMs have already been appointed in more than a thousand ward and village secretariats in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X