కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ : ఆమె జననేంద్రియంలో 40 ఏళ్లుగా రబ్బర్ రింగ్..

|
Google Oneindia TeluguNews

ఇదో అరుదైన ఘటన. 65 ఏళ్ల ఓ వృద్దురాలి జననేంద్రియం నుంచి కర్నూలు వైద్యులు రబ్బర్ రింగ్‌ను తొలగించారు. దాదాపు 40 ఏళ్లుగా ఆ రబ్బర్ రింగ్ ఆమె జననేంద్రియంలో ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల గర్భాశయ సమస్యలతో ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన గైనకాలజీని సంప్రదించగా.. అక్కడి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ రిపోర్ట్స్‌లో ఆమె జననేంద్రియంలో రింగ్ ఉన్నట్టు తేలడంతో గైనకాలజిస్టు సి.మల్లికార్జున్ సర్జరీ ద్వారా దాన్ని తొలగించారు.

రబ్బర్ రింగ్ విషయమై ఆ వృద్దురాలిని వైద్యులు ఆరా తీయగా.. 40 ఏళ్ల క్రితం చివరి ప్రసవం సమయంలో తనకు గర్భాశయం జారినట్టు వెల్లడించింది. దీందో తనకు ప్రసవం చేసిన మంత్రసాని రబ్బర్ రింగ్ను జననేంద్రియంలో అమర్చినట్టు వెల్లడించింది. అప్పటినుంచి తెల్లమైల, ఎర్రమైల, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపింది. బాధితురాలిది తెలంగాణా రాష్ట్రం గద్వాల నియోజకవర్గం కశ్యాపురంగా వైద్యులు వెల్లడించారు.

kurnool doctors removed a vaginal ring from an old woman after 40 years

సాధారణంగా గర్భసంచి జారినవారిలో ఆపరేషన్‌కు ముందు తాత్కాలిక చికిత్సగా రింగ్ పిస్సరిని వాడుతారని వైద్యులు తెలిపారు. అయితే కొంతమంది దాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడి వైద్యులకు చూపించుకోరని అన్నారు. అయితే అది జననేంద్రియంలో ఎక్కువ సంవత్సరాలు ఉండిపోతే తరుచూ అనేక సమస్యలు వస్తాయన్నారు. కొన్నిసార్లు కేన్సర్‌కు కూడా దారితీయవచ్చునని చెప్పారు. కాబట్టి అలాంటి ఇలా రబ్బర్ రింగ్ సమస్యతో బాధపడేవారు నిర్మొహమాటంగా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

English summary
This is a rare Incident. Kurnool doctors removed a rubber ring from a 65-year-old man's genitalia. The rubber ring was found in her genitalia for nearly 40 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X