వీపులు వాయగొడతాం.. కర్నూలు మేయర్ కామెంట్స్
కర్నూలు మేయర్ బీవై రామయ్య విలేకరులపై మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర చేసిన సంగతి తెలిసిందే. వెనకబడిన వర్గాలకు జగనన్న ఎలాంటి పదవులు కట్టబెడుతున్నారో, వారిని ఎలా ఆదుకుంటున్నారో ప్రజలకు తెలియజేస్తూ మళ్లీ జగన్‌కే ఓటు వేయండని చెప్పడమే ఈ బస్సు యాత్ర ఉద్దేశం. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయభేరి సభలో మధ్యాహ్నం ఎండగా ఉందని ప్రజలు నీడ కోసం చెట్లచాటుకు వెళ్లారని, ఆ సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటోలు తీసి ఎవరూ లేరంటూ కొన్ని పత్రికలు పనిగట్టుకొని ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత్రికేయ సంఘాలు మండిపడ్డాయి.

మహానాడు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడే సామాజిక న్యాయభేరి పేరుతో నిర్వహించిన బస్సు యాత్ర అని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ మహానాడు విజయవంతమైందని, ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు.












Click it and Unblock the Notifications