పెద్ద డేంజరే.. రాయచోటి ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో బిగ్ అప్డేట్ !
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ఐబీ పోలీసులు.. అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ అనే ఇద్దరు ఉగ్రవాదులను రాయచోటిలో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలను వెల్లడించారు. నిందితులిద్దరూ 'అల్ ఉమ్మా' ఉగ్రవాదులని తెలిపారు. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు.
అలూమా అనేది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని.. ఐసిస్, అలూమా సంస్థలు ఒకే విధమైన ఆలోచనలతో పనిచేస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ప్రవీణ్ వెల్లడించారు. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని డీఐజీ పేర్కొన్నారు. రాయచోటిలో నిందితులకు సహకరిస్తున్న వారి గురించి విచారణ చేస్తున్నామని చెప్పారు. దాదాపు 50 ఐఈడీలు (పేలుడు పదార్థాలు) తయారు చేసేందుకు కావాల్సిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అలానే రాయచోటిలో కొత్త వారిని చేర్చుకుని, వారికి శిక్షణ ఇచ్చినట్లు వచ్చిన ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా పనిచేస్తున్నాయన్నారు. ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు పేలుడు పదార్థాల గురించి తెలుసా? లేదా? అనే విషయంపై అనుమానాలు ఉన్నాయని డీఐజీ తెలిపారు. వారికి తెలిసే చేశారా లేదా అనేది విచారణలో తెలుస్తుందని ఆయన అన్నారు.
సాంకేతిక నైపుణ్యం కలిగిన ఈ ఉగ్రవాదులు రాయచోటిలో స్థిరపడిన తర్వాత.. 2013 బెంగళూరు మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయం ఉందని ఆయన చెప్పారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్‌లు, దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు దొరికాయని ఆయన వివరించారు. అబూబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లపై కూడా కేసులు నమోదు చేసినట్టు వివరించారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు. వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించామని.. కేసుకి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications