మృత్యుఘోష: 8 మందిని బలి తీసుకున్న ఘోర ప్రమాదం

భక్తి పారవశ్యంతో ఆ రాఘవేంద్రుడి దర్శనం కోసం బయల్దేరిన ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. తెల్లవారుజామున ప్రశాంతంగా సాగుతున్న ప్రయాణాన్ని మృత్యువు లారీ రూపంలో కబళించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం, ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీ అత్యంత వేగంతో ఒకదానికొకటి ఢీకొనడంతో క్షణాల్లో రక్తపాతం చోటుచేసుకుంది.

కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన సుమారు 20 మంది భక్తులు మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. గమ్యస్థానానికి చేరువవుతున్న సమయంలో చిలకలడోన వద్ద ఈ పెను ప్రమాదం సంభవించింది. ప్రమాద దాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు విడవగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉండటం అందరినీ కలిచివేస్తోంది. మరో 12 మంది తీవ్ర గాయాలతో ఎమ్మిగనూరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Kurnool Road Accident 8 Pilgrims from Karnataka Killed Near Mantralayam as Bolero Collides with Lorry
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు?
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు?

హాహాకారాలతో దద్దరిల్లిన ఘటనాస్థలి

ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా భక్తుల హాహాకారాలతో దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహన శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజామున వెలుతురు సరిగ్గా లేకపోవడం, వాహనాల వేగం ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

అక్షరాలపై మృత్యు తాండవం, 115 పసి ప్రాణాలు బలి!
అక్షరాలపై మృత్యు తాండవం, 115 పసి ప్రాణాలు బలి!

పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తూ, గమ్యానికి కూతవేటు దూరంలో ఉండగా ఇలా విగతజీవులుగా మారడం చిక్‌మంగళూరులో ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+