ఎన్నో పార్టీలు మారారు, ఇలాగే: భూమా వ్యాఖ్యపై ఎస్పీ రవికృష్ణ తీవ్రంగా
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పైన కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు. భూమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనను టార్గెట్ చేసుకొని మాట్లాడటంపై ఆయన ఓ టీవీ చానల్‌లో స్పందించారు.
తాను ఫ్యాక్షన్, రౌడీయిజం పట్ల కఠినంగా వ్యవహరించామని చెప్పారు. భూమా నాగిరెడ్డి ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు మారారని చెప్పారు. కానీ, తాము ఏ చొక్కా వేసుకోవాలనేది రాజ్యాంగం తమకు ఓ హక్కు కల్పించిందన్నారు.

తనకు ఖాకీ చొక్కా అంటే చాలా ఇష్టమని, మరో జన్మ అంటూ ఉంటే ఇదే ఖాకీ చొక్కాను వేసుకుంటానని చెప్పారు. నంద్యాల ఘటన ఆధారంగానే కేసు నమోదు చేశామని చెప్పారు.
కాగా, అంతకుముందు భూమా నాగిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలతోనే కర్నూలు జిల్లా ఎస్పీ వైసీపీ నేతల పైన తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలు పెంచుకునే బదులు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలన్నారు.












Click it and Unblock the Notifications