లోకేష్ పాదయాత్రలో నడుస్తా ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్...
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వీటిపై ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు స్పందించి ప్రతి సవాళ్లు విసురుతున్నారు. మరికొందరు ఘాటు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్నూల్లో యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్.. స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముఖ్యంగా కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హఫీజ్ ఖాన్ స్దానికంగా ఉన్న పలు స్ధలాల్ని ఆక్రమించుకుంటున్నట్లు లోకేష్ ఆరోపణలు చేశారు. దీంతో లోకేష్ ఆరోపణలపై స్ధానికంగా చర్చ మొదలైంది. ఇది కాస్తా పెరుగుతుండటంతో హఫీజ్ ఖాన్ స్పందించక తప్పలేదు. లోకేష్ ఆరోపణలపై స్పందించిన హఫీజ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు.

పాదయాత్రలో నారా లోకేష్ తనపై చేసిన భూకబ్జా ఆరోపణలపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. భూకబ్జాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అలాగే లోకేష్ తో కలిసి పాదయాత్రలో నడుస్తానంటూ సవాల్ విసిరారు. తాను అమెరికాలో లగ్జరీ లైఫ్ వదులుకుని సేవ కోసం కర్నూలు వచ్చానంటూ హఫీజ్ ఖాన్ వెల్లడించారు. కర్నూలుకు అన్యాయం చేసిన ఘనత టీడీపీది అన్నారు. నాలుగేళ్లుగా కర్నూలకు తాను ఎంతో సేవ చేశానన్నారు.

ఇప్పటికే లోకేష్ పాదయాత్ర చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయన కబ్జాల ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు దగ్గ ఆధారాలు కూడా బయటపెడుతున్నారు. దీంతో స్ధానికంగా వీటిపై తీవ్ర చర్చ జరుగుతోంది. లోకేష్ ఆరోపణలపై స్పందిస్తూ పలువులు ఎమ్మెల్యేలు ఇప్పటికే తాము సచ్చీలురమని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తాము చేయని పనుల్ని తమకు అంటగడుతున్నారంటూ కౌంటర్లు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications