'యూపిఏపై సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసం వెనుక కెవిపి'
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల అవిశ్వాస తీర్మానం నోటీసు వెనుక తమ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు హస్తం ఉందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మంగళవారం ఆరోపించారు.
అవిశ్వాసం పేరుతో పార్టీ అధిష్టానం పైన తిరుగుబాటు చేసిన సీమాంధ్ర ఎంపీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే ఇది క్రమంగా అలవాటుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆరుగురు ఎంపీలను వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని విహెచ్ డిమాండ్ చేశారు.

బాబుపై దేవినేని ఫైర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విజయవాడలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖలు ఇచ్చిన చంద్రబాబే విభజనలో మొదటి ముద్దాయి అని ఆరోపించారు. కేంద్రం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత సీమాంధ్రకు రూ.5లక్షల ప్యాకే జీ ఇవ్వాలని అడిగిన చంద్రబాబు ఇప్పుడు నీతివాక్యాలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.
కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు విభజన నిర్ణయానికి ముందే అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. అసెంబ్లీలో వ్యతిరేకించిన బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే న్యాయపరమైన పోరాటం ఒక్కటే మార్గమన్నారు.












Click it and Unblock the Notifications