కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలోచర్చకు రాకుండా శుక్రవారం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ వ్యవహారంపై బీజేపీ గందరగోళం సృష్టించి పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకుంది.

దీనిని బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అభివర్ణించారు. పార్లమెంట్‌లో శుక్రవారం చోటు చేసుకున్న తాజా పరిణామాలతో కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరగాలంటూ మరో రెండు వారాలు ఏపీ ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: కేవీపీ బిల్లుకు నిరాశే: అడ్డుపడ్డ ఆప్ ఎంపీ వీడియోలో ఏముంది?

ఎందుకంటే సాధారణంగా ప్రైవేట్ మెంబర్ బిల్లులు నెలలో మొదటి మూడు వారాల్లోనే చర్చకు వస్తాయి కాబట్టి. దీనిని బట్టి చూస్తుంటే కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు తిరిగి మళ్లీ ఆగస్టు 5వ తేదీన రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాదు అప్పుడు కూడా సభ్యులు సమన్వయంతో వ్యవహారిస్తేనే ప్రైవేట్ మెంబర్ బిల్లులపై చర్చ జరుగుతుంది లేదంటే మళ్లీ వాయిదా పడుతుంది. శుక్రవారం రాజ్యసభలో జరిగిన పరిణామాలపై రాజ్యసభ వాయిదా పడిన అనంతరం కేవీపీ ఎంపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు.

Also Read: ఏ పార్టీ బలమెంత: కేవీపీ బిల్లు నెగ్గితే ఏమవుతుంది?

సభను సజావుగా నడిపించాల్సిన రూలింగ్ పార్టీ ఎంపీలే సభను అడ్డుకోవడం దేశ చరిత్రలోనే మొదటి సారని అన్నారు. బీజేపీ ఎంపీలు కావాలనే సభలో గందరగోళం సృష్టించిన సభను వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. సభలో శుక్రవారం జరిగిన తీరుని చూసిన ప్రజలే డిసైడ్ చేసుకుంటారని అన్నారు.

వాస్తవానికి మీరు ప్రవేశ పెట్టిన బిల్లు శుక్రవారం చర్చకు రాదని కొందరు మీడియా మిత్రులు తనతో ముందుగానే చెప్పారన్న కేవీపీ అన్నారు. అయినా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నడిపించాల్సిన అవసరం రూలింగ్ పార్టీకి ఉందని, రూలింగ్ పార్టీ ఆ విధంగా బిల్లుకు సహకరిస్తుందని తాను అనుకున్నానని అన్నారు.

ఎవరెన్ని చెప్పినా తాను నమ్మలేదని చివరకు వారు చెప్పిన మాటలే వాస్తవ మయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో బిల్లు చర్చకు రావడం ఏపీ ప్రజలు దురదృష్టంగా అభివర్ణించారు. ఏపీ ప్రజలు ఇంకా దురదృష్టం నుంచి బయట పడలేదని ఆయన చెప్పుకొచ్చారు.

 కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

దురదృష్టం వారిని ఇంకా వెంటాడతూనే ఉందని అన్నారు. ఏపీ ప్రజలపై బీజేపీకి ఎందుకింత కోపం అనేది నాకు తెలియడం లేదని అన్నారు. బిల్లును ఇలా పోస్టు పోన్ చేయడం వరుసగా ఇది మూడోసారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఈ బిల్లుని ప్రవేశపెట్టారని అన్న ప్రశ్నకు ఇంతకంటే దారుణమైన ఆరోపణ మరోకటి లేదన్నారు.

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

విభజన సమయంలో ప్రధాని మన్మోహాన్ సింగ్ ఇచ్చిన హామీలను మాత్రమే చట్ట రూపంలో చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుందని ఆయన అన్నారు. విభజన బిల్లు పార్లమెంట్‌లో తీసుకురావడానికి ముందు అన్ని అంశాలను ఆ పార్టీ నేతలు కూలంకుషంగా చర్చించిన తర్వాతనే సభలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

బీజేపీ అంగీకరించిన తర్వాతనే సభలో బిల్లు పాస్ అయిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీ విభజన బిల్లు పాల్ అవడంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత బాధ్యతో ఉందో బీజేపీకి అంతే బాధ్యత ఉందన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ బిల్లును బలపర్చడం వల్లే నెగ్గిందని చెప్పిన ఆయన లేకుంటే బిల్లు పాస్ అయ్యేదే కాదన్నారు.

 కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు చిత్తు కాగితంతో సమామనమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లును చట్టం రూపంలోకి తీసుకొచ్చి ఏపీ ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తే ఎంతో సంతోషిస్తానన్నారు.

 కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే ఇదంతా చేస్తుందనే వ్యాఖ్యలకు గాను ఆరు నెలల నిర్ధిష్ట వ్యవధిలో కేంద్రంలో అటు రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చట్టం తీసుకొస్తే సెల్యూట్ చేస్తానన్నారు. అటు రాష్ట్రంలో, ఇటు ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ కాళ్లు, గడ్డాలు పట్టుకుని తీసుకొచ్చి తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును సైతం ఆపేస్తానని అన్నారు.

 కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

కాళ్లు, గడ్డాలు పట్టుకుంటాను: బీజేపీ ఎత్తుగడ ముందు కేవీపీ చిత్తు

తన సవాల్‌ను స్వీకరించి ఆరు నెలల్లో ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు 2018 నాటికి పోలవరం, రాజధానిని పూర్తి చేసేందుకు నిధులు, ఏపీలో హైకోర్టు ఏర్పాటు లాంటి వాటిని ఏర్పాటు చేస్తామని హామి ఇస్తే వారు చెప్పిన పనులన్నీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader KVP Ramachandra rao fires on bjp over bill not coming to rajya sabha on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి