5.ని సరిపోదు, బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండి: కేవీపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు గురువారం సాయంత్రం స్వల్ప చర్చకు వచ్చింది. ఈ చర్చలో భాగంగా ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలపై రాజ్యసభలో చర్చించారు.

ఈ సందర్భంగా రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ తాను సభలో ప్రవేశపెట్టిన బిల్లును విత్ డ్రా చేసుకుంటారనే ప్రచారం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తన బిల్లును విత్ డ్రా చేసుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండంటూ డిప్యూటీ ఛైర్మన్ కురియన్‌ను అడిగారు.

విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

దీంతో కురియన్ కలగజేసుకుని మీ చర్చ ముగిసిన అనంతరం చెబుతానంటూ సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా ఏడాది క్రితం తాను ప్రవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టానని అన్నారు. తాను ప్రవేశపెట్టిన బిల్లువల్లే రాజ్యసభలో చర్చ జరుగుతుందని అన్నారు.

 విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

కుట్రతోనే ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లు అన్నారని అన్నారు. ఏడాది పాటు సమయం వృధా చేసి ఇప్పుడు ద్రవ్య బిల్లు అంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ మద్దతుతోనే ఏపీ విభజన జరిగిందని గుర్తు చేసిన కేవీపీ, తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై కేంద్రం అప్రజాస్వామ్యంగా వ్వవహరిస్తోందని అన్నారు.

 విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

సీమాంధ్ర ఎంపీలు ఎవరూ కూడా ఏపీ విభజన బిల్లుకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, కాబట్టి ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే కోలుకుంటుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధాన ఇచ్చిన హామీలను పక్కనబెట్టారని దుయ్యబట్టారు.

విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

విత్ డ్రా చేసుకోను: బిల్లుపై ఓటింగ్ ఎప్పుడు పెడతారో చెప్పండన్న కేవీపీ

రాజ్యాంగానికి లోబడి నిబంధనల ప్రకారం ప్రైవేట్ మెంబర్ బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అన్నారు. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆగస్టు 5న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress senior leader kvp ramachandra rao on private member bill in rajya sabha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి