వైఎస్ ఉన్నప్పుడే అనుమతులు.. చంద్రబాబుది అసత్య ప్రచారం: పోలవరంపై కేవీపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు అసత్య ప్రచారాలకు పూనుకున్నారని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని కేవీపి గుర్తుచేశారు. గతంలో పోలవరంపై చంద్రబాబు ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు.
Recommended Video


ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేవీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకు వెళ్లి చంద్రబాబు 'స్టే' తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన ఇందిరను, పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. 2019నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని చెప్తున్న చంద్రబాబు.. రూ. 1800 కోట్లతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కేవీపీ ప్రశ్నించారు. 2014నాటి అంచనాలతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. పోలవరం నిర్మాణం కేంద్రం పర్యవేక్షణలో ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications