టెక్కీతో ప్రేమ వివాహం: పిల్లలతో కలిసి రైల్లోంచి దూకి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
గుంటూరు: ఓ మహిళా సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పిల్లలతో సహా రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన గుంటూరు-చుండూరు రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం జరిగింది. ఇందులో ఆమె, ఆమె కూతురు మరణించగా, కొడుకు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.
కృష్ణా జిల్లా విజయవాడలోని చేపల మార్కెట్ సమీపంలో నివసించే కొల్లా సుస్మిత సీఆర్పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. పోరంకికి చెందిన తోట కల్యాణ్ చక్రవర్తిని ప్రేమించి 2006లో వివాహం చేసుకుంది. వివాహమైన ఏడాదికి పుణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చక్రవర్తికి ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో కాపురంలో కలతలు మొదలయ్యాయి.

వీరికి ఇద్దరు పిల్లలు పుట్టినా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఏడాది క్రితం గొల్లపూడిలో ఇద్దరూ కలిసి రూ.45 లక్షల విలువైన అపార్ట్‌మెంట్ కొన్నారు. అప్పటి నుంచి విభేదాలు మరింత పెరిగాయి.
ఈ నెల 23న చక్రవర్తి సోదరుడి వివాహానికి సుస్మిత విజయవాడ వెళ్లగా అక్కడ చక్రవర్తితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె వెంటనే తన ఇద్దరు పిల్లలను తీసుకుని రైల్వేస్టేషన్‌కి వెళ్లి హైదరాబాద్ నుంచి కొల్లాం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపింది. దీంతో వారు కంగారుపడి వెంటనే ఈ విషయాన్ని చక్రవర్తి కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడవద్దని సుస్మితను ఫోన్‌లో కోరారు.
అయినా వినకుండా మొబైల్ అక్కడే వదిలేసి పిల్లలతోసహా సుస్మిత రైలులోంచి దూకేసింది. దీన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగారు. రైలు కొంతదూరం వెళ్లిపోయింది. ఆ రూట్‌లో బయల్దేరిన డీఆర్‌ఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు డ్రైవర్‌కు రైల్వే అధికారులు ఈ విషయం తెలిపారు.
అతడు సంఘటనా స్థలంలో రైలు ఆపి ఇద్దరు పిల్లలను గుంటూరు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే కుమార్తె నైనిక చనిపోయిం ది. ఏడాదిన్నర కొడుకు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సుస్మిత తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications