గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకరికి లవర్, ఒకరికి భర్త: లేడీ పోలీసుల ఫైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lady police fight each other for a man
గుంటూరు: తన భర్త తనకే కావాలంటూ మహిళా హెడ్ కానిస్టేబుల్, తనకు ప్రియుడు కాబట్టి తనతోనే ఉండాలని మహిళా కానిస్టేబుల్ ఘర్షణకు దిగారు. గుంటూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారిద్దరు సస్పెన్షన్‌కు గురయ్యారు. తన భర్త మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయమై మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ తొమ్మిదేళ్లుగా పోరాడుతోంది.

ఇంతకాలం ఎన్ని కేసులు పెట్టినా, హెచ్చరికలు చేసినా వారి బంధం ఆగకపోవడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ మంగళవారం వీధిపోరుకు దిగింది. స్నేహితురాళ్లయిన ఆర్‌ శ్రీదేవి, పిట్టు విజయలక్ష్మి 2002లో కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. 1997లోనే శ్రీదేవి నందం చార్లెస్‌ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

విజయలక్ష్మికి పెళ్లికుదిరి వరుడు చనిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఇద్దరు ఒకే చోట ఉంటున్న సమయంలో శ్రీదేవి భర్త చార్లెస్‌కు విజయలక్ష్మితోవివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా బాపట్లకు చెందిన ఓ యువకుడిని విజయలక్ష్మి పెళ్లి చేసుకున్నా వీరి సంబంధం ఉన్న విషయం తెలిసి విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత వీరు ఇరువురి మధ్య వివాహేతర సం బంధం కొనసాగుతూనే ఉన్నది.

ఇప్పటికే శ్రీదేవీ,విజయలక్ష్మి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మంగళవారం మీడియాను, తన కుటుంబసభ్యులను వెంట పెట్టుకొని శ్రీదేవి విజయలక్ష్మి ఇంటికి వెళ్లగా అక్కడ విజయలక్ష్మి, చార్లెస్‌ దొరికిపోయారు.దీంతో ఇద్దరూ కొట్టుకున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులు వెస్లీని స్టేషన్‌కు, విజయలక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లితో కలిసి శ్రీదేవి పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.

ఒకే రోజు దంపతుల మృతి

మూడుముళ్ల బంధంతో ఒక్కటై 60 ఏళ్లు దాంపత్య జీవనం సాగించిన వృద్ధ దంపతులు ఒకేరోజు అనంత లోకాలకు వెళ్లిపోయిన వైనం కృష్ణా జిల్లా కైకలూరు మండలం వేమవరప్పాడులో సోమవారం జరిగింది. గ్రామ మాజీసర్పంచ్‌ పాకిన వెంకటరెడ్డి(85), అతని భార్య వెంకట నరసమ్మ(80) అన్యోన్య దాంపత్యం సాగించడంతో పాటు ఒకేరోజు మృత్యువు ఒడిలోకి చేరారు.

చేదోడు వాదోడుగా ఉంటానన్న భర్త ఇక లేరని, రారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిందేమో... ఉదయం భర్త మృతదేహం వద్ద కన్నీరుమున్నీరు అయింది. సాయంత్రానికి అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనతో వారి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనమలు, మనవరాళ్ల్లు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ వృద్ధ జంట మృతదేహాలను చూసేందుకు ఊరి జనమంతా పెద్దఎత్తున తరలివచ్చారు.

English summary

 A lady constable and a lady head constable fought each other in the station for a man. Viajayalaxmi and SRidevi suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X