కిరాతకం: మహిళా సర్పంచ్ సజీవ దహనం

Mahabubnagar
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్‌ను ప్రత్యర్థులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవంగా దగ్దం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూర్ మండలం మన్నపురం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ మల్లెల మాణిక్యమ్మ(70)ను ప్రత్యర్థులు బుధవారం సాయంత్రం దాడి చేసి ఒంటిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఉదయం నుండి సొంత పొలంలోని మిరపతోటలో పనులు ముగించుకుని తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్న నేపథ్యంలో గ్రామ సమీపంలోని చెరువుకట్ట దగ్గరకు రాగానే ఒక్కసారిగా పోదల్లో నుండి బయటకు వచ్చిన దుండగులు దాడికి పాల్పడ్డారు.

దెబ్బలకు కిందపడిపోయిన సర్పంచ్‌ను అతికిరాతకంగా నరికి, బండరాయితో కొట్టారు. రక్తపు మడుగులో కొట్టుమిటాడుతూ పెద్దగా కేకలు వేసింది. దాంతో దుండగులు తమ వెంట ముందుగానే ప్లాసిక్ డబ్బాలలో తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను ఒంటిపై పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. మాణిక్యమ్మను తగులబెట్టిన దుండగులు ఆమె శరీరం మంటల్లో తగలబడుతుండడంతో అక్కడి నుండి పరారయ్యారు.

మాణిక్యమ్మ గ్రామ సర్పంచ్‌గా గెలిచిన కొద్ది రోజులకే ఆమెను చంపడానికి ప్రత్యర్థులు కుట్రలు పన్ని విష పదార్థం ఇచ్చారు. అప్పుడు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై పదిహేను రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది శరీరం కుదుటపడ్డాకా తిరిగి గ్రామానికి వచ్చింది. అప్పట్లో గ్రామానికి చెందిన ఓ నాయకుడిపై కేసు కూడా నమోదు అయింది. మరోసారి కూడా సర్పంచ్ మాణిక్యమ్మపై దాడికి ప్రయత్నించగా అప్పుడు కూడా వారి ప్రయత్నాలు పలించలేదు.

కాగా ప్రస్తుతం మాణిక్యమ్మ తమ పొలం నుండి ఒంటరిగా వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రత్యర్థులు దాడి చేసి ఒంటిపై పెట్రోల్, కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారని నారాయణపేట సిఐ లింగయ్య తెలిపారు. సర్పంచ్‌ను సజీవ దహనం చేసి చంపారని తెలుసుకున్న పోలీసులు మన్నపురం చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+