బెంగళూర్ బస్సు ఎక్కిన మహిళా టెక్కీ అదృశ్యం

అక్టోబర్ 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజిబిఎస్‌లో బెంగళూర్ వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న భరణికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళనకు గురైన ఆయన అర్థరాత్రి వరకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
దాంతో మరుసటి రోజు బెంగళూర్‌లో ఆమె పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేశాడు. అయితే, భరణి రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధుమిత్రుల ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదువుపై ఇష్టం లేని యువతి ఆత్మహత్య
చదువుపై అయిష్టతతో ఓ యువతి తన నిండు ప్రాణాలను తీసుకుంది. తనకు చదువు అంటే ఇష్టం లేదంటూ విజయవాడ శ్రీచైతన్య కళాశాలలోని శాంతాభవన్ క్యాంపస్‌లో శ్రీవిద్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ స్వస్థలం కడప జిల్లా.
పోలీసులకు ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. చదువుకోవడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఆమె తన ఆత్మహత్య లేఖలో చెప్పింది. శ్రీవిద్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.












Click it and Unblock the Notifications