వైఎస్ జగన్ పాలన, పవన్ కళ్యాణ్ తీరుపై లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు, టీటీడీపైనా

అమరావతి: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. విజయవాడలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాలన మూడేళ్ల తర్వాతే.. స్నేహం ముందు నుంచే

జగన్ పాలన మూడేళ్ల తర్వాతే.. స్నేహం ముందు నుంచే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలన ఎలా ఉందో మూడేళ్ల తర్వాత తెలుగుస్తుందన్నారు. రాజకీయాలకు ముందు నుంచే జగన్మోహన్ రెడ్డితో తనకు స్నేహం ఉందని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. పోటీ వల్లే సంక్షేమానికి పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై సమతుల్యం పాటించాలని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమంగా ఉండేవని, ప్రభుత్వాలు తమ అవసరాల మేరకు సంక్షేమం, అభివృద్ధిలో దేనికి ఎక్కువ కేటాయించాలో నిర్ణయం తీసుకుంటాయన్నారు.

పవన్ కళ్యాణ్ జనాల్లో ఉండటం అభినందనీయం

పవన్ కళ్యాణ్ జనాల్లో ఉండటం అభినందనీయం

పవన్ కళ్యాణ్ గురించి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. గెలిచినా ఓడినా పవన్ కళ్యాణ్ ప్రజలను అంటిపెట్టుకుని ఉండటం అభినందనీయమని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా పవన్ స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగారని అభినందించారు.

టీటీడీపై లగడపాటి కీలక వ్యాఖ్యలు

టీటీడీపై లగడపాటి కీలక వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఉండాలని కోరుతూ కోర్టులో కేసు వేస్తానన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలపై లగడపాటి స్పందించారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్నందునే టీటీడీ ఆలయంపై ఎవరూ కూడా వేలెత్తి చూపడం లేదన్నారు. వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చే టీటీడీ లాంటి సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆలయాల యాజమాన్యాల విషయంలో కోర్టులు సరైన తీసుకుంటాయని అభిప్రాయపడ్డారు.

ప్రత్యక్ష రాజకీయాలపై మాట మీదే ఉంటా: లగడపాటి

ప్రత్యక్ష రాజకీయాలపై మాట మీదే ఉంటా: లగడపాటి

ఇక తన రాజకీయ జీవితం, సర్వేలపై స్పందిస్తూ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్న మాటకు కట్టుబడి ఉన్నానని రాజగోపాల్ స్పష్టం చేశారు. అంతేగాక, రాజకీయ సర్వేలకు కూడా దూరంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. సామాన్యుడిగా మాత్రమే రాజకీయాలను చూస్తున్నానని, ఆలయాలపై దాడులకు కారణాలను ప్రభుత్వం, పోలీసులు గుర్తించాల్సిన అసవరం ఉందని లగడపాటి అన్నారు. కాగా, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాజగోపాల్ పెద్దగా మీడియా ముందుకు రాని విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+