ఘనత కెసిఆర్‌దే: లగడపాటి, సిఎం సీటు పోటీ: గుత్తా

పొత్తు కోసం బాబు పాకులాట: గుత్తా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వేరుగా ఆరోపించారు. సీమాంధ్రలో ముఖ్యమంత్రి సీటు కోసం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకున్నాయన్నారు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సీమాంధ్రులకు సమస్యలు తప్పవన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అంతా బూటకమేనని ఆరోపించారు. ఇటీవల కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో నేతల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలు కించపర్చేలా ఉన్నాయన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కలిశారు. మరోవైపు ఈ రోజు ముఖ్యమంత్రి కూకట్‌పల్లిలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications