Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ల‌గ‌డ‌పాటి 2014 లో ఏం చెప్పారు..ఏం జ‌రిగింది : ఇప్పుడు అంచ‌నాలు ఇవీ: నిజ‌మ‌వుతాయా..!

Recommended Video

    Ap Assembly Election 2019 : ల‌గ‌డ‌పాటి 2014 లో ఏం చెప్పారు..?? ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు..??

    ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎన్నిక‌ల విశ్లేష‌ణ‌లో ప్ర‌త్యేక స్థానం ఉంది. గ‌త ఏడాది తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఇచ్చిన అంచ‌నాలు పూర్తిగా విఫ‌ల‌మ‌వ్వ‌టంతో ఆయ‌నకు కొంత ప్రాధాన్య‌త త‌గ్గినా..ఇప్ప‌టికీ ల‌గ‌డ‌పాటి స‌ర్వేను ఆస‌క్తి చూసే వారి సంఖ్య త‌గ్గ‌లేదు. ఇక‌, తాజాగా ఆయ‌న ఏపీలోటిడిపి తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చి చెప్పారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన స‌ర్వే ఫ‌లితాల‌ను ఒక‌సారి వాస్త‌వ ఫ‌లితాల‌తో అంచ‌నా వేస్తే...

    2014లో ల‌గ‌డ‌పాటి ఏం చెప్పారు...

    2014లో ల‌గ‌డ‌పాటి ఏం చెప్పారు...

    2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఏపీ-తెలంగాణ లో అసెంబ్లీతో పాటుగా ఏ పార్టీ ఎన్ని లోక్‌స‌భ స్థానాలు సాధిస్తుంద‌నే దాని పైన అంచ‌నాలు వెల్ల‌డించారు. 2014లో ఎన్నిక‌లు పూర్తియ‌న ల‌గ‌డ‌పాటి వెల్ల‌డించిన ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కు మే 7, 2014న పోలింగ్ జ‌రిగింది. ల‌గ‌డ‌పాటి బృందం చేసిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేలో టీడీపీ-బీజేపీ కూట‌మికి 115 నుండి 125 సీట్ల వ‌ర‌కు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసారు. వైసీపీకి 45 నుండి 55 సీట్లు వ‌స్తాయ‌ని విశ్లేషించారు. ఇక‌, 25 లోక్‌స‌భ స్థానాల‌కుగాను టీడీపీ- బీజేపి కూట‌మికి 19-22 సీట్లు ల‌భిస్తాయ‌ని అంచ‌నా వేసారు. ఇక‌, వాస్త‌వ ఫ‌లితాల‌లో టీడీపీకి 102, బీజేపీ కి 4 స్థానాలు ద‌క్కాయి. టీడీపీ-బీజేపి కూట‌మికి 106 స్థానాలు రాగా, ఇద్దరు స్వ‌తంత్రులు గెలిచారు. ఇక‌, వైసీపీకి ల‌గ‌డ‌పాటి 45 నుండి 55 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేయ‌గా..వాస్త‌వంగా 67 సీట్లు ద‌క్కాయి. లోక్‌స‌భ సీట్ల‌లోనూ టీడీపీ- బీజేపి కూట‌మికి 16 రాగా, వైసీపీకి 9 స్థానాలు ద‌క్కాయి.

    తెలంగాణ‌లో అంచ‌నాలు..ఫ‌లితాలు

    తెలంగాణ‌లో అంచ‌నాలు..ఫ‌లితాలు

    ఇక, తెలంగాణ అసెంబ్లీ 2014 ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంచ‌నాల ప్ర‌కారం టీఆర్‌య‌స్‌కు 50-60 సీట్లు, కాంగ్రెస్‌కు 30-40 స్థానాలు, టీడీపీ-బీజేపీకి 18-22 సీట్లు వ‌స్తాయ‌ని ఎగ్జిట్ పోల్ లో అంచ‌నా వేసారు.అదే విధంగా లోక్‌స‌భ సీట్ల‌లో
    టీఆర్‌య‌స్‌కు 8-14 సీట్లు, కాంగ్రెస్ కు 3-5 స్థానాలు, టీడీపీ-బీజేపీ కూట‌మికి 3-4 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం ద‌క్కుతుంద‌ని అంచనా వేసారు. అయితే, 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ తెలంగాణ‌లో ఎన్ని సీట్లు సాధిస్తుంద‌నేది మాత్రం ల‌గ‌డ‌పాటి త‌న ఎగ్జ‌ట్ పోల్ స‌ర్వేలో అంచ‌నా వేయ‌లేక‌పోయారు. ఇక‌, వాస్త‌వ ఫ‌లితాలు చూస్తే తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌య‌స్ కు 63 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 21 స్థానాలు ద‌క్కాయి. టీడీపీ-బీజేపీ కూట‌మికి 20 సీట్లు వ‌చ్చాయి. కాగా, ఎంఐఎంకు ఏడు స్థానాలు రాగా..వైసీపీ 3 సీట్లు ద‌క్కించుకుంది. అదే విధంగా ఇత‌రులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఇక‌, లోక్‌స‌భ సీట్లు చూస్తే..టీఆర్‌య‌స్ 12 సీట్లు, కాంగ్రెస్‌-2 స్థానాలు, టీడీపీ-బీజేపి కూట‌మి రెండు స్థానాల్లోనూ గెలుపొంద‌గా, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచింది.

    2018లో త‌ల‌కిందులైన అంచ‌నాలు..

    2018లో త‌ల‌కిందులైన అంచ‌నాలు..

    ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీని ముందుగానే ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. వాస్త‌వంగా తాజా ఎన్నిక‌ల‌తో పాటుగా తెలంగాణ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ఆరు నెల‌ల ముందుగానే ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అప్పుడు ఫ‌లితాల పైన ల‌గ‌డ‌పాటి త‌న అంచ‌నాలను వెల్ల‌డించారు. అధికార పార్టీకి ఎదురు దెబ్బ త‌గులుతుంద‌ని కాంగ్రెస్‌- టీడీపీతో కూడిన మ‌హా కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని ల‌గ‌డ‌పాటి త‌న అంచ‌నాలు వెల్ల‌డించారు. అదే విధంగా ఎనిమిది మంది వ‌ర‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్దులు గెలుస్తార‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలోనే వీటి పైన టీఆర్‌య‌స్ నేత‌లు హెచ్చ‌రించారు. త‌మ గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇక ఫ‌లితాలు మాత్రం ల‌గ‌డ‌పాటి అంచ‌నాల‌కు పూర్తి భిన్నంగా వ‌చ్చాయి. టిఆర్‌య‌స్ అత్య‌ధిక స్థానాల్లో గెలుపొంది వ‌రుస‌గా రెండో సారి అధికారంలోకి వ‌చ్చింది. త‌న అంచ‌నాలు విఫ‌ల‌మ‌వ్వ‌టానికి కార‌ణాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌గ‌డ‌పాటి చెప్ప‌లేక పోయారు.

    ఏపీలో టీడీపీ వైపే రాజ‌గోపాల్ మొగ్గు..

    ఏపీలో టీడీపీ వైపే రాజ‌గోపాల్ మొగ్గు..

    ఇక‌, ల‌గ‌డ‌పాటి తాజాగా ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో తిరిగి టీడీపీ అధిక్య‌త నిల‌బెట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. టీడీపీ అధికారంలో కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. సంక్షేమం - అభివృద్దికి ఏపీ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని చెబుతున్న లగ‌డ‌పాటి టీడీపీకి అనుకూలంగా త‌న ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసారు. తెలంగాణ‌లో త‌న స‌ర్వే అంచ‌నాలు ఫెయిల్ అవ్వ‌టంతో...ఇప్పుడు అంచ‌నాలు త‌న ప్ర‌తిష్ఠ‌కు సంబంధించిన‌వి అంటూ విశ్లేష‌ణ మొద‌లు పెట్టారు. ఏపీ ప్ర‌జ‌లు సంక్షేమం - అభివృద్దికి ప‌ట్టం క‌ట్టారంటూ తాను ఎగ్జిట్ పోల్ చేసిన ఫ‌లితాల‌ను విడుద‌ల చేసారు. మ‌రి..ఇత‌ర స‌ర్వే సంస్థ‌లు వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు ఇస్తుంటే ల‌గ‌డ‌పాటి మాత్రం భిన్నంగా లెక్క‌లు చెబుతున్నారు. ఉత్త‌రాది స‌ర్వే సంస్థ‌ల‌కు ఏపీ ప్ర‌జ‌ల నాడి అంత సులువుగా దొర‌క‌ద‌న్న‌ది ల‌గ‌డ‌పాటి వాద‌న‌. మ‌రి..ల‌గ‌డ‌పాటి జోస్యం ఎంత వ‌ర‌కు ఫలిస్తుందో 23న తేలాల్సిందే..

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+